అరుణాచల్‌ప్రదేశ్ అక్కాచెల్లెళ్ల పాట వైరల్.. 1.56 కోట్లకు పైగా వ్యూస్!
ABN , Publish Date - Oct 02 , 2026 | 03:44 PM
చుట్టూ పచ్చని కొండలు.. ఆహ్లాదాన్ని పంచే ప్రకృతి అందాలు.. ఆ మధ్యలో మధురంగా పాట పాడుతున్న ముగ్గురు చిన్నారులు! వారి గానం, చిలిపి హావభావాలు ఇప్పుడు నెట్టింట సందడి చేస్తున్నాయి. ఓ బాలీవుడ్ పాటను ఆలపిస్తూ లక్షలాది మంది మనసులు గెలుచుకున్న ఆ చిన్నారుల గురించి...
ఇంటర్నెట్ డెస్క్: అరుణాచల్‌ప్రదేశ్‌కు చెందిన ముగ్గురు చిన్నారులు పాడిన పాట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సింగా, న్గమ్‌జాన్, లిల్లీ అనే అక్కాచెల్లెళ్లు కలిసి బాలీవుడ్ పాటలను పాడుతూ అలరిస్తున్నారు. కొండ కోనల్లో ప్రకృతి అందాల నడుమ వారు చేస్తున్న ఈ మధుర గానానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
ఈ ముగ్గురూ కలిసి ‘పతి పత్నీ ఔర్ వో’ చిత్రంలోని ‘ఏక్ తూ హీ యార్ మేరా’ పాటను ఆలపించిన వీడియో విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇప్పటికే ఈ వీడియోకు ఇప్పటికే 1.56 కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి. పాట పాడుతూ మధ్య మధ్యలో చిన్న చిన్న స్టెప్పులతో అదరగొడుతూ సందడి చేసిన చిన్నారుల వీడియోపై ప్రస్తుతం ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు నెటిజన్లు.
ముగ్గురు సోదరీమణుల మధ్య కనిపించిన అనుబంధం, సహజమైన హావభావాలు, కొండల అందమైన నేపథ్యం.. ఈ వీడియోకు మరింత ఆకర్షణ తీసుకొచ్చాయి. ‘ఒకే ఫ్రేమ్‌లో ఇంత క్యూట్‌నెస్’ అంటూ పలువురు కామెంట్లు చేయగా.. మరికొందరు వారిని ‘ట్రూ ఏంజిల్స్(నిజమైన దేవదూతలు)’ అంటూ కొనియాడారు. ఈ ముగ్గురు సిస్టర్స్ పాటల కోసం నెటిజన్లు మరింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇవీ చదవండి:
నాడు నానీ.. నేడు మచ్చార్.. ఇజ్రాయెలీలకు అండగా భారతీయులు.!
రైలు ఇంజిన్‌కు చీర కొంగు కట్టి.. పట్టాలపై మహిళ డ్యాన్స్ వైరల్..