రైలు ఇంజిన్‌కు చీర కొంగు కట్టి.. పట్టాలపై మహిళ డ్యాన్స్ వైరల్..
ABN , Publish Date - Oct 01 , 2026 | 06:57 PM
సోషల్ మీడియాలో వైరల్ కావడానికి కొందరు చిత్రవిచిత్రమైన రీతిలో వీడియోలు చేస్తున్నారు. తాజాగా ఓ మహిళ చేసిన వీడియో నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది.
ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియాలో వైరల్ కావడానికి కొందరు చిత్రవిచిత్రమైన రీతిలో వీడియోలు చేస్తున్నారు. తాజాగా ఓ మహిళ చేసిన వీడియో నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. రైల్వే పట్టాలపై నిలబడి, ఆగి ఉన్న రైలు ఇంజిన్‌కు తన చీర కొంగును కట్టి ఆమె డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై పలువురు నెటిజన్లు విమర్శలు గుప్పించారు (Woman Dance Video).
వైరల్ అవుతున్న వీడియోలో ఓ మహిళ చీర, సన్‌గ్లాసెస్ ధరించి రైల్వే పట్టాలపై కనిపించింది. ఆమె తన చీర కొంగును ఆగి ఉన్న రైలు ఇంజిన్‌కు కట్టింది. అనంతరం రైలు ముందు నిలబడి పాటకు అనుగుణంగా డ్యాన్స్ చేయడం ప్రారంభించింది. బాలీవుడ్ సినిమాల్లో కనిపించే రైలు సన్నివేశాన్ని అనుకరిస్తూ ఆమె ఈ వీడియో చేసినట్లు కనిపిస్తోంది. పాటకు లిప్ సింక్ చేస్తూ, వివిధ హావభావాలతో డ్యాన్స్ చేసింది (Railway Track Reel).
@Nalanda_index అనే ఎక్స్ యూజర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు (Social Media Viral). తాజా వీడియోలో రైలు ఆగి ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ, రైల్వే ట్రాక్‌లపై అనుమతి లేకుండా వీడియోలు చిత్రీకరించడం సురక్షితం కాదు. వీడియోపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు కనిపించాయి. కొందరు ఆమె చేసిన ప్రయత్నాన్ని వినోదంగా తీసుకున్నారు. మరికొందరు కేవలం సోషల్ మీడియా వీక్షణల కోసం రైల్వే ప్రదేశాల్లో ఇలాంటి చర్యలు చేయడం సరికాదని వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి..
రూ. 9లక్షల కోట్లు ఆవిరి.. భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు..
అస్సాంలో 9 మంది బంగ్లాదేశీయుల అరెస్ట్.. నకిలీ ఆధార్ కార్డులు స్వాధీనం..