Share News

పెట్రోల్, డీజిల్ ధరల పెంపు.. లీటర్‌కు రూ.5, రూ.3 పెంచిన నయారా ఎనర్జీ

ABN , Publish Date - Oct 03 , 2026 | 03:46 PM

ప్రైవేట్ ఇంధన విక్రయ సంస్థ నయారా ఎనర్జీ పెట్రోల్, డీజిల్ ధరలను పెంచింది. పెట్రోల్ లీటర్‌కు రూ.5, డీజిల్ ధరను రూ.3 చొప్పున పెంచింది. ఈ కొత్త ధరలు అక్టోబర్ 3, 2026 నుంచి అమల్లోకి వచ్చాయి.

పెట్రోల్, డీజిల్ ధరల పెంపు.. లీటర్‌కు రూ.5, రూ.3 పెంచిన నయారా ఎనర్జీ
Nayara Energy petrol price hike

ఇంటర్నెట్ డెస్క్: ప్రైవేట్ ఇంధన విక్రయ సంస్థ నయారా ఎనర్జీ పెట్రోల్, డీజిల్ ధరలను పెంచింది. పెట్రోల్ లీటర్‌కు రూ.5, డీజిల్ ధరను రూ.3 చొప్పున పెంచింది. ఈ కొత్త ధరలు అక్టోబర్ 3, 2026 నుంచి అమల్లోకి వచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు, శుద్ధి చేసిన పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెరగడంతో ఇంధన విక్రయ సంస్థలపై మార్జిన్ ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో నయారా ధరల పెంపు నిర్ణయం తీసుకుంది (Nayara Energy petrol price hike).


నయారా ఎనర్జీ దేశవ్యాప్తంగా 7,108 పెట్రోల్ పంపులను నిర్వహిస్తోంది. ఈ అన్ని కేంద్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు అమల్లోకి వచ్చింది. అయితే స్థానిక పన్నుల కారణంగా వినియోగదారులు చెల్లించే తుది ధరల్లో రాష్ట్రాల మధ్య వ్యత్యాసం ఉండొచ్చు. ప్రపంచ మార్కెట్లో ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెరగడం వల్ల ఇంధన విక్రయ సంస్థలపై వ్యయ భారం పెరిగింది (Nayara petrol price).


నయారా ఎనర్జీ ఈ ఏడాది మార్చి 26న కూడా పెట్రోల్ ధరను రూ.5, డీజిల్ ధరను రూ.3 చొప్పున పెంచింది (Nayara Energy fuel prices). అయితే అంతర్జాతీయ చమురు ధరలు తగ్గడంతో జూలై 1న నయారా పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.3 చొప్పున ధరలను తగ్గించింది. తాజా పెంపుతో మార్చిలో చేసిన పెంపు మళ్లీ అమల్లోకి వచ్చినట్లైంది. అయితే దేశంలోని ప్రధాన ప్రభుత్వ రంగ చమురు విక్రయ సంస్థలు మాత్రం ధరలను పెంచలేదు.


ఇవి కూడా చదవండి..

శ్రీసిటీలో ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

శ్రీసిటీ బాయిలర్ పేలుడు.. సేఫ్టీ ఆడిట్‌కు పవన్ కల్యాణ్ ఆదేశాలు

Updated Date - Oct 03 , 2026 | 03:49 PM