యువతిపై దాడి చేసి.. భవనంపై నుంచి దూకి యువకుడి ఆత్మహత్య
ABN , Publish Date - Oct 03 , 2026 | 02:34 PM
విజయవాడలోని న్యూ రాజరాజేశ్వరి పేటలో దారుణం జరిగింది. 19 ఏళ్ల యువతిపై చిన్నా అనే యువకుడు దాడి చేశాడు. అనంతరం భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
విజయవాడ, అక్టోబర్ 3: నగరంలోని న్యూ రాజరాజేశ్వరి పేటలో దారుణం జరిగింది. 19 ఏళ్ల యువతిపై చిన్నా అనే యువకుడు దాడి చేశాడు. అనంతరం భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. యువకుడి చేతిలో తీవ్రంగా గాయపడిన యువతికి ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. దీంతో ఆస్పత్రి వద్ద యువతి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ప్రస్తుతం చిన్నా మృతదేహాన్ని విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
కాగా, న్యూరాజరాజేశ్వరి పేటకు చెందిన యవతీ, యువకుడు ఆరు నెలలుగా ప్రేమించుకుంటున్నారని తెలుస్తోంది. అయితే కొంతకాలానికి చిన్నాను యువతి దూరం పెట్టినట్లు సమాచారం. ఈ విషయంలో ఇరువురి మధ్య గొడవలు జరిగినట్లు తెలుస్తోంది. ఇటీవల కూడా వారిద్దరి మధ్య గొడవ జరిగిందని, యువకుడిని మందలించి పంపించినట్లు యువతి కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఈరోజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో తమ అమ్మాయిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచినట్లు వారు తెలిపారు. అమ్మాయి అరుపులు విని వచ్చేసరికి రక్తపుమడుగులో పడి ఉందని.. వెంటనే ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. అలాగే చిన్నా కూడా పక్క బిల్డింగ్‌పై నుంచి దూకి చనిపోయాడని యువతి కుటుంబసభ్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి..
శ్రీసిటీలో ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
శ్రీసిటీ బాయిలర్ పేలుడు.. సేఫ్టీ ఆడిట్‌కు పవన్ కల్యాణ్ ఆదేశాలు
Read Latest AP News And Telugu News