SIRపై ప్రకాశ్ రాజ్ ఫైర్.. సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్
ABN , Publish Date - Oct 03 , 2026 | 01:16 PM
ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై నటుడు ప్రకాశ్ రాజ్ స్పందించారు. సీఈసీ జ్ఞానేష్‌కుమార్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్, అక్టోబర్ 3: ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై నటుడు ప్రకాశ్ రాజ్ స్పందించారు. సీఈసీ జ్ఞానేష్‌కుమార్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు(శనివారం) మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి ఏడాది ఓటర్ల చెకింగ్ జరుగుతుందని.. SIR వచ్చే ముందు అదేంటో కూడా తెలియదని అన్నారు. బతికి ఉంటే ఓటు కోసం మళ్లీ దరఖాస్తు చేసుకోమంటున్నారని మండిపడ్డారు. అక్రమ చొరబాటుదారులుంటే ఇన్నేళ్లుగా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
చొరబాట్లపై కేంద్ర హోంశాఖ ఏం చర్యలు తీసుకుందని నటుడు నిలదీశారు. ఓటర్ల షిఫ్టింగ్ జరిగితే.. మొత్తంగా ఓటర్ల సంఖ్య తగ్గొద్దు కదా అని అడిగారు. ప్రజలు అందుబాటులో లేకపోతే ఓటు తీసేస్తారా అంటూ ఫైర్ అయ్యారు. ఉపాధి కోసం వలస వెళ్తే.. ఇంట్లో లేరని ఓట్లు తొలగించారని ఆరోపించారు. దళితులు, ముస్లింల ఓట్లు తొలగించడమే వారి ప్రధాన అజెండా అంటూ ప్రకాశ్ రాజ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ఇవి కూడా చదవండి..
అంతర్రాష్ట్ర గంజాయి ముఠా గుట్టురట్టు.. 3.3 కిలోల గంజాయి స్వాధీనం
వికారాబాద్‌లో ప్రమాదం.. బస్సు బోల్తా పడి నలుగురి మృతి
Read Latest Telangana News And Telugu News