ఓట్లు తొలగించి నాలుగోసారి అధికారంలోకి రావాలని యత్నం.. బీజేపీపై వీహెచ్ ఫైర్
ABN , Publish Date - Oct 03 , 2026 | 02:11 PM
ఆర్ఎస్ఎస్, బీజేపీకి రిజర్వేషన్లు ఇవ్వాలన్న ఆలోచన లేదని ప్రభుత్వ సలహాదారుడు వీహెచ్ వ్యాఖ్యానించారు. ఓట్లు తొలగించి నాలుగో సారి అధికారంలోకి రావాలని చూస్తున్నారని ఆరోపించారు.
హైదరాబాద్, అక్టోబర్ 3: ఆర్ఎస్ఎస్, బీజేపీకి రిజర్వేషన్లు ఇవ్వాలన్న ఆలోచన లేదని ప్రభుత్వ సలహాదారుడు వీహెచ్ వ్యాఖ్యానించారు. ఈరోజు(శనివారం) మీడియాతో మాట్లాడుతూ.. ఓట్లు తొలగించి నాలుగో సారి అధికారంలోకి రావాలని చూస్తున్నారని ఆరోపించారు. ఎన్డీయే ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్‌ను తన గుప్పిట్లో పెట్టుకుందని విమర్శించారు. సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్‌ను అడ్డం పెట్టుకొని ఓట్లు తొలగిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి, కొత్త రాజ్యాంగాన్ని అమలు చేయాలని చూస్తున్నారని అన్నారు. సెన్సెస్ జరుగుతున్నా కూడా ఓబీసీల ఊసే లేదని మండిపడ్డారు. కర్నాటకలో 15వేల ఓట్లు ఎందుకు తీసివేశారో జవాబు చెప్పలేదన్నారు.
రేపు(ఆదివారం) ఓబీసీ చైర్మన్ వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో శంషాబాద్‌లో సభ నిర్వహిస్తున్నట్లు వీహెచ్ తెలిపారు. సభకు అందరూ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు వస్తున్నారని.. రేపటి సభ తర్వాత రాష్ట్రం అంత తిరుగనున్నట్లు ప్రకటించారు. ఓబీసీ గర్జన ఢిల్లీలో చూపించాలన్నారు. ‘ఇది మనకు చివరి అవకాశం. మనం అందరం యుద్ధం చేయాలి. అప్పుడే మనకు న్యాయం జరుగుతుంది. లేదంటే మన పిల్లలకు భవిష్యత్తు లేదు’ అని అన్నారు. రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపర్చాలని చెప్పుకొచ్చారు. సెన్సెస్‌లో కేంద్రం ఓబీసీల కాలం చేర్చే వరకు పోరాటాన్ని కొనసాగించాలని వీహెచ్ పిలుపునిచ్చారు.
ఇవి కూడా చదవండి..
వికారాబాద్‌లో ప్రమాదం.. బస్సు బోల్తా పడి నలుగురి మృతి
SIRపై ప్రకాశ్ రాజ్ ఫైర్.. సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్
Read Latest Telangana News And Telugu News