Share News

రాజమండ్రికి భారీ నిధులు.. పుష్కరాల పనులపై మంత్రి నారాయణ కీలక ప్రకటన

ABN , Publish Date - Oct 03 , 2026 | 01:15 PM

గోదావరి పుష్కరాల నేపథ్యంలో రాజమండ్రి అభివృద్ధికి ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రతికూలంగా ఉన్నప్పటికీ పుష్కరాలను వైభవంగా నిర్వహించేందుకు వెనుకాడబోమని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. వివరాల్లోకి వెళితే..

రాజమండ్రికి భారీ నిధులు.. పుష్కరాల పనులపై మంత్రి నారాయణ కీలక ప్రకటన
Godavari Pushkaralu

అమరావతి, అక్టోబర్ 3: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అవసరమైన నిధులు కేటాయించిందని మంత్రి నారాయణ తెలిపారు. రాజమండ్రిలో పుష్కరాల అభివృద్ధి పనుల కోసం రూ.1,000 కోట్లు మంజూరు చేశామని.. పుష్కరాలకు సంబంధించిన వివిధ పనులకు మొత్తం సుమారు రూ.2,000 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. కేంద్ర నిధులతో గతంలో నిలిచిపోయిన ప్రాజెక్టులను తిరిగి ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ‘జల్‌ జీవన్‌ మిషన్‌’ కింద కేంద్రం గతంలో రూ.5,350 కోట్లు మంజూరు చేసినప్పటికీ, 2019 ఫిబ్రవరిలో ఆ నిధులను వినియోగించలేదని మంత్రి ఆరోపించారు.


అమరావతిని ప్రపంచంలోని టాప్‌-5 రాజధానుల్లో ఒకటిగా నిర్మించే లక్ష్యంతో పనులు ప్రారంభించామని మంత్రి నారాయణ తెలిపారు. గత ప్రభుత్వం అమరావతి అభివృద్ధిని నిర్వీర్యం చేసిందని విమర్శించారు. 2028 చివరి నాటికి అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేసేలా సీఎం చంద్రబాబు చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. మున్సిపల్‌ ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, ఈ అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నామని తెలిపారు. కోర్టు తీర్పు వచ్చే వరకు ఎన్నికలను నిలిపివేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్న నారాయణ, రానున్న రోజుల్లో రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహిస్తామని వెల్లడించారు.


ఇవి కూడా చదవండి..

హనుమాన్‌ చాలీసా చదివి ధైర్యం తెచ్చుకున్నా..

చంపేస్తున్న ‘సెకండ్‌ స్మోకింగ్‌’

మరిన్ని నేషనల్, ఇంటర్నేషనల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 03 , 2026 | 02:03 PM