75 శాతం సబ్సిడీతో రబీ విత్తనాల పంపిణీ.. రూ.52 కోట్లకు పైగా ఖర్చు: మంత్రి తుమ్మల
ABN , Publish Date - Oct 03 , 2026 | 01:56 PM
తెలంగాణలో రబీ విత్తనాల పంపిణీని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ప్రారంభించారు. విత్తనాలపై 50-75 శాతం సబ్సిడీతో పాటు కొన్ని రకాల విత్తనాలపై 100 శాతం సబ్సిడీ అందిస్తున్నట్లు తెలిపారు.
హైదరాబాద్, అక్టోబర్ 3: రబీ విత్తన పంపిణీ కార్యక్రమాన్ని రైతు నేస్తం 109వ ఎపిసోడ్‌లో వ్యవసాయ శాఖామంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ప్రారంభించారు. ఈ మేరకు ఆయన రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. యాసంగిలో తక్కువ నీరు, తక్కువ పెట్టుబడి, తక్కువ కాలవ్యవధిలో అధిక ఆదాయాన్నిచ్చే పంటలకే రైతులు ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వం యాసంగి పంటలను ప్రోత్సహించేందుకు రైతులకు నాణ్యమైన విత్తనాలను అందుబాటులోకి తెచ్చినట్లు ఆయన వెల్లడించారు. ఈ మేరకు రబీ విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు.
విత్తనాలపై 50 నుంచి 75 శాతం వరకు సబ్సిడీని కల్పిస్తున్నట్లు మంత్రి తుమ్మల తెలిపారు. కొన్ని విత్తన రకాలకు 100 శాతం సబ్సిడీ అందిస్తున్నట్లు ఆయన చెప్పారు. మొత్తంగా విత్తనాల సబ్సీడీకి రూ.52 కోట్లకు పైగా నిధులను ప్రభుత్వం వెచ్చిస్తున్నట్లు తుమ్మల తెలిపారు. రబీ పంటలైన నూనెగింజలు, పప్పుధాన్యాల సాగుకు ప్రభుత్వం భారీ ప్రోత్సాహకాలను అందిస్తోందని తుమ్మల తెలిపారు. 21 జిల్లాల్లో 29వేల క్వింటాళ్లకుపైగా పప్పుధాన్యాల విత్తనాల పంపిణీ చేస్తున్నట్లు మంత్రి తుమ్మల వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
కల్యాణలక్ష్మి రద్దుకు రేవంత్ కుట్ర
చార్మినార్‌పై పనిచేయని గడియారం
Read Latest AP News And Telangana News And International News And Telugu News