చార్మినార్‌పై పనిచేయని గడియారం
ABN , Publish Date - Oct 03 , 2026 | 09:07 AM
చార్మినార్ కట్టడానికి నాలుగు వందల ఏళ్ల చరిత్ర ఉన్నప్పటికీ నిర్వహణా లోపం వెంటాడుతోంది. కట్టడంపై లాడ్‌బజార్ వైపు ఉన్న గడియారం గడిచిన మూడు రోజులుగా పనిచేయడం లేదు.
హైదరాబాద్: చార్మినార్ కట్టడానికి నాలుగు వందల ఏళ్ల చరిత్ర ఉన్నప్పటికీ నిర్వహణా లోపం వెంటాడుతోంది. కట్టడంపై లాడ్‌బజార్ వైపు ఉన్న గడియారం గడిచిన మూడు రోజులుగా పనిచేయడం లేదు. ఎప్పుడు చూసినా అర్ధరాత్రి 12.30గంటల వద్దే ఉంటుంది. ఈ విషయాన్ని స్థానికులు, పర్యాటకులు అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఇప్పటివరకు ఎటువంటి చర్యలూ తీసుకోకపోవడం గమనార్హం. గతంలోనూ ఓ వైపున్న వాచ్ ప్లేట్‌లు ఊడిపోయి పనిచేయకపోవడంతో పర్యాటకులు,
స్థానికులు ఆందోళన వ్యక్తం చేయడంతో మరమ్మతు చేశారు. ప్రస్తుతం మళ్లీ అటువంటి పరిస్థితి తలెత్తడంతో స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ చారిత్రక కట్టడం నిర్వహణ విషయంలో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై విమర్శలు గుప్పిస్తున్నారు. పర్యాటకుల నుంచి వచ్చే ఆదాయంపై దృష్టిపెడుతున్న అధికారులు మరమ్మతుల విషయం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
కల్యాణలక్ష్మి రద్దుకు రేవంత్ కుట్ర
శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలు
Read Latest AP News And Telangana News And International News And Telugu News