Share News

హైదరాబాద్‌లో నేడు ఈ ప్రాంతాల్లో విద్యుత్‌ కోత

ABN , Publish Date - Oct 03 , 2026 | 07:26 AM

హైదరాబాద్ నగరంలోని ఆజామాబాద్‌ డివిజన్‌ పరిధిలో మరమ్మతుల నిమిత్తం శనివారం విద్యుత్‌ సరఫరా ఉండదని సిబిడిఎడిఇ జి. నాగేశ్వరరావు తెలిపారు.

హైదరాబాద్‌లో నేడు ఈ ప్రాంతాల్లో విద్యుత్‌ కోత
power cut, Hyderabad

చిక్కడపల్లి(హైదరాబాద్): హైదరాబాద్ నగరంలోని ఆజామాబాద్‌ డివిజన్‌ పరిధిలో మరమ్మతుల నిమిత్తం శనివారం విద్యుత్‌ సరఫరా ఉండదని సిబిడిఎడిఇ జి. నాగేశ్వరరావు తెలిపారు. మదర్‌ డైరీ 11కెవి విద్యుత్‌ ఫీడర్‌ పరిధిలో ఉదయం 11 గంటలనుంచి మధ్యాహ్నం 1గంటలవరకు, చిక్కడపల్లి పరిదిలో మధ్యాహ్నం 2 గంటలనుంచి 3 గంటలవరకు, ఆప్కో పరిధిలో మధ్యాహ్నం 3 గంటలనుంచి సాయంత్రం 4 గంటలవరకు, గాంధీకుటీర్‌ పరిధిలో సాయంత్రం 4 గంటలనుంచి 5 గంటలవరకు విద్యుత్‌ సరఫరాను నిలిపివేస్తామన్నారు.


కాప్రా: విద్యుత్‌ లైన్ల మరమ్మతుల కారణంగా వెంకటేశ్వరనగర్‌ ఫీడర్‌ పరిధిలోని హెచ్‌బీ కాలనీ, ఇందిరానగర్‌, రాఘవేంద్రనగర్‌, డైమండ్‌హిల్స్‌ కాలనీ పరిసర ప్రాంతాలలో శనివారం ఉదయం 12 నుంచి 12.30 గంటల వరకు, మౌలాలి ఫీడర్‌ పరిధిలోని గోపాల్‌నగర్‌, హనుమాన్‌నగర్‌, ఓల్డ్‌ మౌలాలి, ఎస్పీనగర్‌, మహాలక్ష్మీ టెంపుల్‌, కస్తూరిబానగర్‌, రావునగర్‌, జవహర్‌నగర్‌, వసంత్‌ విహార్‌ కాలనీ పరిసర ప్రాంతాలలో ఉదయం 11 నుంచి 11.30 గంటల వరకు విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నట్టు మౌలాలి సెక్షన్‌ ఏఈ వెంకట్‌ రెడ్డి తెలిపారు.


పేట్‌బషీరాబాద్‌: దూలపల్లి సబ్‌స్టేషన్‌ పరిధిలో ఫీడర్ల మరమ్మతుల కారణంగా శనివారం విద్యుత్‌ ఉండదని ఏఈ శ్రీనివాస్‌ ఒక ప్రకటనలో తెలిపారు. దూలపల్లి, సొసైటీ ఫీడర్‌ల్లోని మహాలక్ష్మి కాలనీ దూలపల్లి గ్రామ పాఠశాల, సాయినగర్‌కాలనీ, అశోక్‌ ఆలామైసన్‌, ఫేజ్‌-3, సెంట్‌మార్టిన్‌ కళాశాల, గోళి సోడారోడ్డు, జెఎస్‌డబ్య్లూగల్లీ, రేణుకా ప్లాస్టిక్‌ తదితర ప్రాంతాల్లో 11గంటల నుంచి 12గంటల వరకు విద్యుత్‌ ఉండదని, అపర్ణ ఫీడర్‌లోని సెంట్రల్‌పార్కు, దూలపల్లి ఎక్స్‌రోడ్డు, హైవేరోడ్డు నుంచి ఏఎంఆర్‌లైన్‌, రాజధాని ధాబా,


city1.2.jpgఅపర్ణ, కొంపల్లి బ్రిడ్జి, ఏఎంఆర్‌ వైన్స్‌ వెనుక వైపు, డిలేట్‌ అపార్టుమెంట్‌లైన్‌, అపర్ణ వెంచర్‌, వికాస్‌ విల్లాస్‌లైన్‌ వేదాద్రి బిల్డర్స్‌ లైన్‌లో మధ్యాహ్నం 1.30నుంచి సాయంత్రం 3.30 వరకు, డోలారిధన్‌ ఫీడర్‌లో పోచమ్మగడ్డ, సాయికృప అపార్టుమెంట్స్‌, హార్లిక్స్‌ వీధి, శ్రీకాంత్‌రెడ్డి గోదాం, డోలారి ధన్‌ దాబాలైన్‌, చైత్యన్య స్కూల్స్‌, వెంకట్‌రెడ్డి గోదాం, వైష్ణవివిల్లాస్‌, పోచమ్మగడ్డ నుంచి హైవే రోడ్డు కొంపల్లి బ్రిడ్జి వరకు ఉదయం 11.30 గంటల నుంచి 12 గంటల వరకు విద్యుత్‌ ఉండదని, వినియోగదారులు గమనించి, సహకరించాలని ఏఈ శ్రీనివాస్‌ కోరారు.


కేపీహెచ్‌బీకాలనీ: టీజీఎస్పీడీసీఎల్‌ వసంతనగర్‌ సెక్షన్‌ పరిధిలో 11కేవీ ఏబీ స్విచ్ఛ్‌ పనుల నేపథ్యంలో శనివారం పలు ప్రాంతాల్లో కరెంట్‌ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ ఇంద్రసేనారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు కేపీహెచ్‌బీ ఆరోఫేజ్‌, భగత్‌సింగ్‌నగర్‌ ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా ఉండదని పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

కల్యాణలక్ష్మి రద్దుకు రేవంత్‌ కుట్ర

శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 03 , 2026 | 07:26 AM