Share News

యాదాద్రిలో ఐదో యూనిట్‌ను నెలాఖరుకల్లా సిద్ధం చేయాలి:జెన్‌కో సీఎండీ

ABN , Publish Date - Oct 03 , 2026 | 06:33 AM

యాదాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌లోని 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఐదో యూనిట్‌ను ఈ నెలాఖరుకల్లా సిద్ధం చేయాలని జెన్‌కో సీఎండీ డాక్టర్‌ ఎస్‌.హరీశ్‌ అధికారులను ఆదేశించారు.

యాదాద్రిలో ఐదో యూనిట్‌ను నెలాఖరుకల్లా సిద్ధం చేయాలి:జెన్‌కో సీఎండీ

హైదరాబాద్‌, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): యాదాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌లోని 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఐదో యూనిట్‌ను ఈ నెలాఖరుకల్లా సిద్ధం చేయాలని జెన్‌కో సీఎండీ డాక్టర్‌ ఎస్‌.హరీశ్‌ అధికారులను ఆదేశించారు. ఐదో యూనిట్‌లోని యాష్‌హ్యాండ్లింగ్‌, కోల్‌ హ్యాండ్లింగ్‌, బాయిలర్‌, టర్బైన్‌ విభాగాలను శుక్రవారం బీహెచ్‌ఈఎల్‌ డైరెక్టర్‌ (పవర్‌) తజిందర్‌ గుప్తాతో కలిసి ఆయన పరిశీలించారు. పెండింగ్‌ పనులను వేగవంతం చేయడంతో పాటు యూనిట్‌- 5 సింక్రనైజేషన్‌ను ఈనెల 15వ తేదీలోపు పూర్తి చేయాలని సూచించారు. రాష్ట్రంలో పెరిగిన విద్యుత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకొని, యాదాద్రిలోని నాలుగు యూనిట్లను పూర్తిస్థాయి సామర్థ్యంతో నడిపించడంతో పాటు ఐదో యూనిట్‌ను వీలైనంత త్వరగా ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటున్నామని సీఎండీ తెలిపారు.

Updated Date - Oct 03 , 2026 | 06:33 AM