Share News

వైద్యులపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం

ABN , Publish Date - Oct 03 , 2026 | 06:47 AM

యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌ పోచంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న మహిళా వైద్యురాలిపై జరిగిన దాడిని తెలంగాణ గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ (టీజీవో) డాక్టర్స్‌ ఫోరమ్‌ తీవ్రంగా ఖండించింది.

వైద్యులపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం

  • టీజీవో డాక్టర్స్‌ ఫోరమ్‌ డిమాండ్‌

హైదరాబాద్‌, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌ పోచంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న మహిళా వైద్యురాలిపై జరిగిన దాడిని తెలంగాణ గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ (టీజీవో) డాక్టర్స్‌ ఫోరమ్‌ తీవ్రంగా ఖండించింది. ఫోరమ్‌ అధ్యక్షుడు డాక్టర్‌ కత్తి జనార్దన్‌ ఈ విషయమై ఓ ప్రకటన విడుదల చేస్తూ, బాధ్యులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. నిరంతరం సేవలందించే వైద్యులు, వైద్య సిబ్బందిపై విధి నిర్వహణలో దాడులు జరగడం అత్యంత విచారకరమని పేర్కొన్నారు. వైద్యులపై దాడి చేయడం అంటే ప్రజారోగ్య వ్యవస్థపై దాడి చేయడమేనని, వైద్యులకు ప్రభుత్వం తగిన రక్షణ చర్యలు కల్పించాలని కోరారు.

Updated Date - Oct 03 , 2026 | 06:47 AM