ప్రతిమ మెడికల్ కాలేజీ అక్రమ వసూళ్లు..
ABN , Publish Date - Oct 03 , 2026 | 06:52 AM
కరీంనగర్ ప్రతిమ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (పిమ్స్) యాజమాన్యం విద్యార్థుల నుంచి అక్రమంగా వసూలు చేసిన రూ.15.60 కోట్ల అదనపు ఫీజులను వెంటనే తిరిగి చెల్లించాలని మెడికో పేరెంట్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది.
రూ.15.60 కోట్లు రీఫండ్ చేయాల్సిందే..!
మెడికో పేరెంట్స్ అసోసియేషన్ డిమాండ్
లేదంటే అమిత్ షా పర్యటన అడ్డుకుంటామని హెచ్చరిక
హైదరాబాద్, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్ ప్రతిమ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (పిమ్స్) యాజమాన్యం విద్యార్థుల నుంచి అక్రమంగా వసూలు చేసిన రూ.15.60 కోట్ల అదనపు ఫీజులను వెంటనే తిరిగి చెల్లించాలని మెడికో పేరెంట్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మల్లోజుల సత్యనారాయణ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అదనపు ఫీజులను వెంటనే రీఫండ్ చేయాలని, లేనిపక్షంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కళాశాల పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరించారు.