Share News

అమెరికా వెళ్లాల్సింది పోయి.. చర్లపల్లి జైలుకు!

ABN , Publish Date - Oct 03 , 2026 | 08:15 AM

మరో రెండు రోజుల్లో ఆ యువకుడు అమెరికా వెళ్లాల్సి ఉంది. ఆ జోష్‌లో స్నేహితులతో కలిసి మందు పార్టీ చేసుకున్నాడు. అందరూ కలిసి అర్ధరాత్రి దాకా మద్యం సేవించారు. తాగిన మైకంలో కారు డ్రైవ్‌ చేస్తూ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వారిని ఢీకొట్టాడు.

అమెరికా వెళ్లాల్సింది పోయి.. చర్లపల్లి జైలుకు!
Cherlapally jail

  • కుషాయిగూడ కారు ప్రమాద నిందితుడి కేసులో ట్విస్ట్‌

హైదరాబాద్: మరో రెండు రోజుల్లో ఆ యువకుడు అమెరికా వెళ్లాల్సి ఉంది. ఆ జోష్‌లో స్నేహితులతో కలిసి మందు పార్టీ చేసుకున్నాడు. అందరూ కలిసి అర్ధరాత్రి దాకా మద్యం సేవించారు. తాగిన మైకంలో కారు డ్రైవ్‌ చేస్తూ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వారిని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఏడుగురు యువకులు గాయాలపాలు కావడానికి కారణం అయ్యాడు. దీంతో అరెస్ట్‌ అయి చర్లపల్లి జైలుకు వెళ్లాడు.


కుషాయిగూడ పోలీస్ స్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ ప్రమాద వివరాలిలా ఉన్నాయి. ఈసీఐఎల్‌ చౌరస్తా సమీపంలో సెప్టెంబరు 29న అర్ధరాత్రి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఏడుగురు యువకులను వేగంగా దూసుకువచ్చిన కారు ఢీకొట్టిన సంగతి తెలిసిందే. మౌలాలిలో ఓ రెస్టారెంట్‌లో పనిచేసి కమలానగర్‌లోని ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్న బిహార్‌కు చెందిన ఏడుగురు కార్మికులను అతి వేగంగా వచ్చిన కారు (ఏపి10ఏయు1232) ఢీకొట్టింది.


city3.jpgదీంతో తీవ్రగాయాలపాలైన కార్మికులను స్థానికులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు ప్రమాదానికి కారణమైన టీఎస్ఐఐసీ కాలనీకి చెందిన ఈవురు పవన్‌కుమార్‌(36)ను మరుసటి రోజు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. దీంతో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. పవన్‌కుమార్‌ మరో రెండు రోజుల్లో ఉద్యోగం కోసం అమెరికా వెళ్లాల్సి ఉంది.


దీంతో కొంత మంది స్నేహితులకు మందు పార్టీ ఇచ్చాడు. అనంతరం పవన్‌ మరో స్నేహితుడు కార్తీక్‌తో కలిసి కారులో ఇంటికి బయలుదేరాడు. ఈ క్రమంలో అతివేగంగా డ్రైవింగ్‌ చేస్తూ ఈసీఐఎల్‌ చౌరస్తా సమీపంలో వీరిని ఢీకొట్టాడు. మద్యం సేవించిన పవన్‌కు డ్రైవింగ్‌ లైసెన్స్‌ సైతం లేదని బాధితులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్‌ చేసి చర్లపల్లి జైలుకు తరలించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

కల్యాణలక్ష్మి రద్దుకు రేవంత్‌ కుట్ర

శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 03 , 2026 | 08:15 AM