శ్రీసిటీ బాయిలర్ పేలుడు.. మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల పరిహారం
ABN , Publish Date - Oct 03 , 2026 | 03:03 PM
తిరుపతి జిల్లాలోని శ్రీసిటీలో ఉన్న ఓ ప్రైవేట్ పరిశ్రమలో వాటర్ బాయిలర్ పేలి ఐదుగురు మృతి చెందారు. వీరి కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం ప్రకటించింది.
అమరావతి, అక్టోబర్ 3: తిరుపతి జిల్లాలోని శ్రీసిటీలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకొచ్చింది. శ్రీసిటీలోని ఓ ప్రైవేట్ పరిశ్రమలో వాటర్ బాయిలర్ పేలి ఐదుగురు మృతి చెందారు. వీరి కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. రూ.50 లక్షల చొప్పున పరిహారం అందించనున్నట్టు తెలిపింది.
కాగా ఈరోజు (శనివారం) శ్రీసిటీలోని ఔషధాలు తయారు చేసే పరిశ్రమలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు కార్మికులు మృతి చెందగా, మరికొందరు గాయపడ్డారు. క్షతగాత్రులను అధికారులు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.
ఈ వార్తలూ చదవండి
శ్రీసిటీలో ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
శ్రీసిటీ బాయిలర్ పేలుడు.. సేఫ్టీ ఆడిట్‌కు పవన్ కల్యాణ్ ఆదేశాలు