Share News

విజయనగరం జిల్లాలో వైసీపీకి మరో షాక్

ABN , Publish Date - Oct 03 , 2026 | 11:55 AM

విజయనగరం జిల్లాలో వైసీపీకి వరుసగా షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే ఆ పార్టీని మజ్జి శ్రీనివాసరావు వీడారు. అనంతరం ఆయన అనుచరులు పలువురు జడ్పీటీసీలు ఆ పార్టీకి రాజీనామా చేశారు.

విజయనగరం జిల్లాలో వైసీపీకి మరో షాక్
Ex MLA Baddukonda Appalanaidu

విజయనగరం, అక్టోబర్ 03: జిల్లాలో వైసీపీకి వరుసగా షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే ఆ పార్టీని మజ్జి శ్రీనివాసరావు వీడారు. అనంతరం ఆయన అనుచరులు పలువురు జడ్పీటీసీలు ఆ పార్టీకి రాజీనామా చేశారు. తాజాగా ఆ పార్టీకి నెల్లిమర్ల మాజీ ఎమ్మెల్యే, జడ్పీ మాజీ చైర్మన్ బడ్డుకొండ అప్పలనాయుడు రాజీనామా చేశారు. పార్టీ నుంచి సస్పెండ్ అయిన కొన్ని గంటలకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. శనివారం విజయనగరంలో బడ్డుకొండ అప్పలనాయుడు విలేకర్లతో మాట్లాడుతూ.. గౌరవం లేని చోట తాను, తన అనుచరులు ఉండలేమని తెలిపారు. అందుకే వైసీపీకీ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఓ నియంత అని అభివర్ణించారు. ఆ పార్టీ ఓ లిమిటెడ్ కంపెనీ అని వ్యాఖ్యానించారు. ప్రజా వ్యతిరేక చర్యలు చేయడం వల్లే వైసీపీ గత ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైందని తెలిపారు.


ఆ ఎన్నికల్లో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు ఓడిపోతారని జగన్ సంధి ప్రేలాపనలు చేసి.. వైసీపీని నాశనం చేశారని వివరించారు. వైసీపీలో క్రమశిక్షణ కమిటీ అంటూ ఒకటి వుందా? అని ఆ పార్టీ నేతలను ఆయన సూటిగా ప్రశ్నించారు. సొంత పార్టీ కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టు చెలరేగుతున్నారంటూ వైసీపీ నేతలపై ఆయన నిప్పులు చెరిగారు.


జగన్‌ను నమ్ముకొని వేలాది కుటుంబాలు కూలిపోయాయని ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న శ్రీను మా బావ కాబట్టి తనను కారణం లేకుండా సస్పెండ్ చేశారని విమర్శించారు. మరి చిన్న శ్రీనుకి బావ బొత్స సత్యనారాయణ అని తెలిపారు. మరి ఆయన్ని కూడా సస్పెండ్ చేయగలరా? అంటూ వైసీపీ అగ్రనేతలకు బడ్డుకొండ అప్పలనాయుడు సవాల్ విసిరారు.


ఇవి కూడా చదవండి..

మేడ్చల్‌లో రోడ్డు ప్రమాదం.. బైక్‌ను ఢీకొన్న కారు, భర్త మృతి

‘మీ ధైర్యసాహసాలకు వందనాలు’.. కెప్టెన్ స్మిత్ మచ్చార్‌‌పై చిరంజీవి ప్రశంసలు

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 03 , 2026 | 12:43 PM