దసరా, దీపావళికి గుంతకల్లు మీదుగా ప్రత్యేక రైళ్లు
ABN , Publish Date - Oct 03 , 2026 | 12:49 PM
దసరా, దీపావళి పండుగలను పురస్కరించుకుని గుంతకల్లు మీదుగా బెంగళూరు-చర్లపల్లి ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
గుంతకల్లు(అనంతపురం): దసరా, దీపావళి పండుగలను పురస్కరించుకుని గుంతకల్లు మీదుగా బెంగళూరు-చర్లపల్లి ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. చర్లపల్లి-బెంగళూరు వీక్లీ ప్రత్యేక రైలు (నం. 07065) ఈనెల 5, 12, 19, 26, నవంబరు 2, 9, 16, 23, 27, 30 తేదీల్లో రాత్రి 9.50 గంటలకు చర్లపల్లిలో బయలుదేరి మరుసటిరోజు 1.15 గంటలకు బెంగళూరు చేరుకుంటుందన్నారు.
దీని తిరుగు ప్రయాణపు రైలు (నం.07066) ఈనెల 6, 13, 20, 27, అక్టోబరు 3, 10, 17, 24 తేదీల్లో మధ్యాహ్నం 3.50 గంటలకు బెంగళూరులో బయలుదేరి మరుసటిరోజు ఉదయం ఐదున్నరకు చర్లపల్లికి చేరుకుంటుందన్నారు. ఈ రైలు సికిందాబ్రాద్, బేగంపేట, లింగంపల్లి, వికారాబాద్, సేడం, యాద్గిర్, క్రిష్ణా, రాయచూరు, మంత్రాలయం రోడ్డు, ఆదోని, గుంతకల్లు, అనంతపురం, ధర్మవరం, హిందూపురం, యల్హంక స్టేషన్ల మీదుగా వెళ్తుందన్నారు.
బెంగళూరు మెము రైలు పాక్షిక రద్దు
బెంగళూరు, అనంతపురం మధ్య నడుస్తున్న మెము ప్యాసింజరు (నం. 66559/60) రైలును వివిధ తేదీల్లో 11 రోజులపాటు పాక్షికంగా రద్దు పరస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. రంగేపల్లి-పెనుగొండ సెక్షన్‌లో ట్రాక్ రెన్యువల్ పనుల కారణంగా రైలును పాక్షికంగా రద్దుపరచినట్లు తెలియజేశారు. ఈనెల 4, 7, 9, 11, 14, 16, 18, 21, 23, 25, 28 తేదీల్లో రైలును బెంగళూరు-హిందూపురం సెక్షన్‌లో రద్దుపరిచామన్నారు. హిందూపురం-అనంతపురం సెక్షన్‌లో మాత్రమే నడుపుతామన్నారు.
తిరుపతికి ప్రత్యేక రైలు
పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుపతి-విజయపుర మధ్య ప్రత్యేక రైలు నడపనున్నట్లు రైల్వే అధికారులు శుక్రవారం తెలిపారు. తిరుపతి-విజయపుర ప్రత్యేక వీక్లీ రైలు (నం. 07419) ఈనెల 4వ తేదీ నుంచి 25వ తేదీ వరకూ ప్రతి ఆదివారం ఉదయం 8.15 గంటలకు తిరుపతిలో బయలుదేరి అదేరోజు రాత్రి 10.25కి విజయపుర స్టేషన్‌కు చేరుకుంటుందన్నారు. దీని తిరుగు ప్రయాణపు రైలు (నం. 07420) ఆదివారాల్లో రాత్రి 11.35 గంటలకు విజయపుర స్టేషన్‌లో బయలుదేరి సోమవారం మధ్యాహ్నం 2.15 గంటలకు తిరుపతి చేరుకుంటుందన్నారు. ఈ రైలు రేణిగుంట, కోడూరు, రాజంపేట, కడప, యర్రగుంట్ల, తాడిపత్రి, గుత్తి, గుంతకల్లు, బళ్లారి, తోరణగల్లు, హోస్టేట, కొప్పల్, గదగ్, హోలే ఆలూరు, బాదామి, బాగల్‌కోట్, ఆల్మట్టి, బసవన బాగేవాడి రోడ్ స్టేషన్ల మీదుగా విజయపుర స్టేషన్‌కు చేరుతుందని వివరించారు.
గుత్తి మీదుగా ప్రత్యేకంగా..
ప్రయాణికుల డిమాండ్ మేరకు చర్లపల్లి-తిరువన్నామలై (వయా గుత్తి) ఏడు ట్రిప్పుల అప్ అండ్ డౌన్ ప్రత్యేక రైలు నడపనున్నట్లు రైల్వే అధికారులు శుక్రవారం ప్రకటనలో తెలిపారు. చర్లపల్లి-తిరుపవన్నామలై ప్రత్యేక రైలు (నం. 07003) ఈ నెల 6వ తేదీ నుంచి నవంబరు 11వ తేదీ వరకూ మంగళవారాల్లో ఏడు ట్రిప్పులు తిరుగుతుందన్నారు. దీని తిరుగు ప్రయాణపు రైలు (నం. 07004) ఈనెల 7 నుంచి నవంబరు 18వతేదీ వరకూ బుధవారాల్లో ఏడు ట్రిప్పులు నడుపుతామన్నారు. ఈ రైలు కాచిగూడ, మహబూబ్‌నగర్, వనపర్తి రోడ్, గద్వాల, కర్నూలు సిటీ, డోన్, గుత్తి, తాడిపత్రి, యర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు, కడప స్టేషన్ల మీదుగా వెళ్తుందన్నారు.
వెంకటాద్రి ఎక్స్ప్రెస్కు నందలూరులో స్టాపింగ్
కాచిగూడ-చిత్తూరు-కాచిగూడ వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ (నం. 12797/98)ను ఈనెల 3వ తేదీ నుంచి కడప జిల్లా నందలూరు స్టేషన్‌లో స్టాపింగ్ కల్పించినట్లు రైల్వే అధికారులు శుక్రవారం ప్రకటనలో తెలిపారు. ఈ రైలు నందలూరు స్టేషన్‌లో నిమిషంసేపు నిలుస్తుందన్నారు. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకూ ఇక్కడ రైలు స్టాపింగ్ కొనసాగుతుందని అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
విజయనగరం జిల్లాలో వైసీపీకి మరో షాక్
శ్రీసిటీలో ఘోర ప్రమాదం.. బాయిలర్ పేలుడు.. ఐదుగురికి పైగా మృతి
Read Latest AP News And Telangana News And International News And Telugu News