Share News

ఆసియాడ్ క్రికెట్: అభిషేక్, తిలక్ హాఫ్ సెంచరీలు.. పాకిస్థాన్ టార్గెట్ ఎంతంటే?

ABN , Publish Date - Oct 03 , 2026 | 11:53 AM

ఆసియా క్రీడలు 2026లో భాగంగా స్వర్ణ పతకం కోసం చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ జట్లు ఫైనల్ పోరులో తలపడుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లకు 6 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది.

ఆసియాడ్ క్రికెట్: అభిషేక్, తిలక్ హాఫ్ సెంచరీలు.. పాకిస్థాన్ టార్గెట్ ఎంతంటే?
India vs Pakistan

ఇంటర్నెట్ డెస్క్: ఆసియా క్రీడలు 2026లో భాగంగా స్వర్ణ పతకం కోసం చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ జట్లు ఫైనల్ పోరులో తలపడుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లకు 6 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. పాకిస్థాన్‌కు 212 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ(61; 28 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్లు), తిలక్ వర్మ(51*; 22 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు) హాఫ్ సెంచరీలతో రాణించారు.


అభిషేక్ శర్మ ఔట్ అయ్యాక భారత బ్యాటర్లు వరుసగా పెవిలియన్ బాట పట్టారు. ఆఖరిలో వచ్చిన తిలక్ వర్మ, శివమ్ దూబె దూకుడుగా ఆడటంతో భారత్‌ ఈ స్కోర్ చేయగలిగింది. వీరిద్దరూ కలిసి ఆరో వికెట్‌కు 30 బంతుల్లో 62 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వైభవ్ సూర్యవంశీ(15), సంజు శాంసన్(2), ఇషాన్ కిషన్(20), శివమ్ దూబె(27) పరుగులు చేశారు. అక్షర్ పటేల్(1*) నాటౌట్‌గా నిలిచాడు. పాకిస్థాన్ బౌలర్లలో అహ్మద్ దానియల్, అరాఫత్ మిన్హాస్ చెరో 2 వికెట్లు, సైమ్ ఆయుబ్, అబ్రార్ అహ్మద్ తలొక వికెట్ పడగొట్టారు.


ఇవి కూడా చదవండి:

ఆసియా క్రీడలు: ప్రణవి శరత్ సంచలనం.. గోల్ఫ్‌లో భారత్‌కు తొలి స్వర్ణం

క్రిస్ గేల్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు.. చరిత్ర సృష్టించిన ప్రొటీస్ క్రికెటర్

Updated Date - Oct 03 , 2026 | 12:04 PM