Share News

ఆసియాడ్ క్రికెట్: పాకిస్థాన్‌తో ఫైనల్ మ్యాచ్.. టాస్ నెగ్గిన భారత్

ABN , Publish Date - Oct 03 , 2026 | 09:42 AM

ఆసియా గేమ్స్ 2026లో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ స్వర్ణ పతకం కోసం పోటీ పడనున్నారు. ఈ క్రమంలో టాస్ నెగ్గిన భారత్.. బ్యాటింగ్ ఎంచుకుంది.

ఆసియాడ్ క్రికెట్: పాకిస్థాన్‌తో ఫైనల్ మ్యాచ్.. టాస్ నెగ్గిన భారత్
India vs Pakistan

ఇంటర్నెట్ డెస్క్: ఆసియా గేమ్స్ 2026లో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ స్వర్ణ పతకం కోసం పోటీ పడనున్నారు. ఈ క్రమంలో టాస్ నెగ్గిన భారత్.. బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత పాకిస్థాన్ ఫీల్డింగ్ చేయనుంది. డిఫెండింగ్ ఛాంపియన్స్‌గా బరిలోకి దిగిన టీమిండియా.. నేడుగా క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. సెమీస్‌లో శ్రీలంకను చిత్తుగా ఓడించి ఫైనల్ చేరిన భారత్.. స్వర్ణం పట్టేయాలని కసిగా ఉంది. మరోవైపు చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో మ్యాచ్ కావడంతో అభిమానుల్లో కూడా ఆసక్తి నెలకొంది. మరి గోల్డ్ ఎవరు పట్టేయనున్నారో చూడాలి.


భారత్ తుది జట్టు:

శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, సంజు శాంసన్(వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, శివమ్ దూబె, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, బుమ్రా


పాకిస్థాన్ తుది జట్టు:

షాహిబ్జాదా ఫర్హాన్(కెప్టెన్), సదాఖత్, ఉస్మాన్ ఖాన్(వికెట్ కీపర్), సైమ్ ఆయుబ్, హసన్ నవాజ్, అబ్దుల్ సమాద్, అరాఫత్ మిన్హాస్, అహ్మద్ దానియాల్, సాద్ మసూద్, అబ్రార్ అహ్మద్, సుఫ్‌యాన్ మొకిమ్


ఇవి కూడా చదవండి:

వన్డే ప్రపంచ కప్ 2027.. గంభీర్ ముందున్న అతిపెద్ద సవాల్ ఇదే: గంగూలీ

జైస్వాల్ ఆడకపోయినా పర్వాలేదు.. ఆ ఇద్దరినే కొనసాగించాలి: రహానె

Updated Date - Oct 03 , 2026 | 09:48 AM