పొగాకు తీసి.. గంజాయి పోసి..
ABN , Publish Date - Oct 03 , 2026 | 11:49 AM
ఇతర జిల్లాలు రాష్ట్రాల నుంచి వరంగల్ నగరానికి గంజాయి పెద్ద ఎత్తున సరఫరా అవుతోంది.
సిగరెట్లతో అక్రమ దందా
రూటు మార్చిన స్మగ్లర్లు
నగరంలో గుట్టు చప్పుడు కాకుండా సరఫరా
మట్టెవాడ(వరంగల్): ఇతర జిల్లాలు రాష్ట్రాల నుంచి వరంగల్ నగరానికి గంజాయి పెద్ద ఎత్తున సరఫరా అవుతోంది. విద్యార్థులు, యువతను లక్ష్యంగా చేసుకొని ఈ దందా నడు స్తోంది. మొదట్లో అతి తక్కువ ధరకు అలవాటు చేసి.. దానికి యువకులు, విద్యార్థులు బానిస కాగానే ధరలు పెంచి సొమ్ము చేసుకుంటున్నారు. వరంగల్ నగరంలో కొన్ని పాన్ షాపుల్లో సిగరెట్లలో పొగాకు తొలగించి అందులో గంజాయి నింపి విక్రయిస్తున్నారు. ఇలా చిన్నసిగరెట్‌కు రూ.50, పెద్ద సిగరెట్‌కు రూ.100 చొప్పున విక్రయిస్తున్నారు.
పోలీసులకు దొరకకుండా రూటు మార్చి రూ.లక్షలు సంపాదిస్తున్నారు. సిగరెట్ల లోపల పొగాకును తీసేసి ప్రత్యేకమైన ఓసిబి రోలింగ్ పేపర్లను ఉపయోగించి గంజాయి నింపి గుట్టు చప్పుడు కాకుండా నగరంలో సరఫరా చేస్తున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా గంజాయి దందా యథే చ్ఛగా సాగుతోంది. నగరంలో నిర్మానుష్యమైన ప్రదేశాల్లో యువత గంజా యి సేవిస్తున్నారు.
ముఖ్యంగా వరంగల్ కొత్తవాడ కాకతీయ కెనాల్ వెంబ డి, చిన్న వడ్డేపల్లి చెరువు కట్ట, మార్కెట్ రోడ్డు, కాశిబుగ్గ ఎల్బీనగర్ స్మశాన వాటిక వద్ద, కాశిబుగ్గ ఓ సిసీకాలనీ, చింతల్ ఫ్లైఓవర్ కింద, శివనగర్, కొత్తవాడ, ఆటోనగర్, కోటిలింగాల రోడ్డు, కాశిబుగ్గ పార్కు, ఏనుమాముల శివారు, మార్కెట్ 100ఫీట్ల రోడ్డు, కరీంబాద్ ఉర్సు గుట్ట రోడ్డు, నగర శివారూల్‌లోని నిర్మానుష్య ప్రాంతాల్లో ఏజెంట్ల ద్వారా గంజాయి దందా సాగిస్తున్నారు.
పాన్ షాపుల్లో....
వరంగల్ నగరంలో కొన్ని పాన్ షాపులు అర్ధరాత్రి వరకు తెరిచి ఉంటున్నాయి. వరంగల్ బస్టాండ్‌వద్ద, రైల్వేస్టేషన్ శివనగర్ వైపు, మండి బజార్, ఎల్బీనగర్, హంటర్ రోడ్ వరంగల్, ఎంజీఎం రోడ్, కొత్తవాడ ఆటోనగర్, రంగశాయిపేట, నాయుడు పెట్రోల్ పంపు రోడ్డు, ఉర్సుగుట్ట బైపాస్ రోడ్డు ప్రాంతంలో, చార్‌బౌలి, రంగంపేట, దేశాయిపేట రోడ్డు జాన్‌పాక్ రోడ్డు ఏనుమాముల బాలాజీనగర్ ప్రాంతాలలోని కొన్ని పాన్ షాపుల్లో సిగిరెట్, గంజాయి ప్యాకెట్లదందా సాగుతున్నట్లు సమాచారం.
రాత్రి సమయంలో దాడులు
వరంగల్ నగరంలో రాత్రి సమయంలో గంజాయి సేవించిన యువకులు దాడులకు దిగుతున్నారు. రాత్రి సమయంలో ద్విచక్ర వాహనాలను అతి వేగంగా నడుపుతూ త్రిబుల్ రైడింగ్ చేస్తూ.. సైలెన్సర్ శబ్దాలతో హారన్ శబ్ధాలతో నానా హంగామా సృష్టిస్తున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే కర్ర లు బీరు సీసాతో దాడులకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా జేపీఎన్ రోడ్, మండిబజార్, పోచమ్మ మైదాన్ నుంచి దేశాయిపేట రోడ్, ఎల్బీనగర్ రోడ్డు,
తిలక్ రోడ్, కాశిబుగ్గ ప్రధాన రహదారి, కాశిబుగ్గ నుంచి ఓసీటికి వెళ్లే రహదారి, కాశిబుగ్గ సొసైటీ కాలనీ రోడ్డు, చార్‌బౌలి రోడ్, కోటిలింగాల గుడి రోడ్డు, కొత్తవాడ 80 ఫీట్ల రోడ్లలో అత్యంత ప్రమాదకరమైన వేగంతో వాహనం నడుపుతూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. అయినప్పటికీ పోలీసులు పట్టించుకోవడంలేదని, ఇప్పటికైనా స్పందిం చి గంజాయి రవాణాను అరికట్టాలని నగరవాసులు కోరుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
కల్యాణలక్ష్మి రద్దుకు రేవంత్ కుట్ర
చార్మినార్‌పై పనిచేయని గడియారం
Read Latest AP News And Telangana News And International News And Telugu News