పైలట్ జీ.. మీరు అద్భుతం చేశారు.. మచ్చార్‌పై సల్మాన్ ఖాన్ ప్రశంసలు
ABN , Publish Date - Oct 03 , 2026 | 10:39 AM
ప్రాణాలను పణంగా ఉగ్రదాడి నుంచి కొన్ని వందల మందిని కాపాడిన భారతీయ పైలట్ స్మిత్ మచ్చార్‌పై బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ప్రశంసల జల్లు కురిపించారు. మచ్చార్ అద్భుతం చేశారని కొనియాడారు. ఈ మేరకు ఎక్స్‌లో ఆయన ట్వీట్ చేశారు. మచ్చార్‌ను చూస్తుంటే తనకు సంతోషంగా ఉందన్నారు.
ఇంటర్‌నెట్ డెస్క్: ప్రాణాలను పణంగా ఉగ్రదాడి నుంచి కొన్ని వందల మందిని కాపాడిన భారతీయ పైలట్ స్మిత్ మచ్చార్‌పై బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ప్రశంసల జల్లు కురిపించారు. మచ్చార్ అద్భుతం చేశారని కొనియాడారు. ఈ మేరకు ఎక్స్‌లో ఆయన ట్వీట్ చేశారు. మచ్చార్‌ను చూస్తుంటే తనకు సంతోషంగా ఉందన్నారు.
‘పైలట్ జీ.. మీరు అద్భుతం చేశారు. మీ ప్రాణాలను పణంగా పెట్టి కోపైలట్‌ను ప్రతిఘటించారు. ఉగ్రదాడి నుంచి విమాన ప్రయాణికులను కాపాడారు. మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. మేమందరం మీకు సెల్యూట్ చేస్తున్నాం. వెల్‌డన్ బ్రో. మీతో కలిసి విమానంలో ప్రయాణించాలనుకుంటున్నా’ అని సల్మాన్ ట్వీట్ చేశారు. కాగా.. గత నెల 30న దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌కు వెళుతున్న ఫ్లైదుబాయ్ విమానంలో మచ్చార్‌పై కోపైలట్ దాడిచేసిన విషయం తెలిసిందే.
మాకు చాలా గర్వంగా ఉంది
పైలట్ స్మిత్ మచార్‌పై రాజ్‌కోట్‌లోని ఆయన కుటుంబ సభ్యులు కూడా హర్షం వ్యక్తం చేశారు. మచ్చార్ చూపిన ధైర్యసాహసాలపై తమకు గర్వంగా ఉందని ఆయన కజిన్ పులకిత్ మచ్చార్ అన్నారు. శనివారం మీడియాతో ఆయన మాట్లాడారు. స్మిత్ మచ్చార్ పోరాటాన్ని కొనియాడారు. అంతమంది ప్రాణాలను రక్షించినందుకు మచ్చార్‌కు తామంతా రుణపడి ఉన్నామని చెప్పారు. ‘మచ్చార్ నా కజిన్ అని చెప్పుకోవడానికి నాకు గర్వంగా ఉంది. మచ్చార్ చూపిన తెగువకు మా కుటుంబ సభ్యులు, మా సామాజికవర్గంతో పాటు దేశమంతా గర్విస్తోంది. ఆయన ఎంతో మంది ప్రాణాలను కాపాడినందుకు ఆనందంగా ఉంది. దేశ ప్రధాని కూడా మచ్చార్‌ను మెచ్చుకున్నారు. ప్రతిఒక్కరికీ మచ్చార్ గర్వకారణం’ అని పులకిత్ అన్నారు.
ఇవి కూడా చదవండి..
హనుమాన్ చాలీసా చదివి ధైర్యం తెచ్చుకున్నా..
చంపేస్తున్న ‘సెకండ్ స్మోకింగ్’
మరిన్ని నేషనల్, ఇంటర్నేషనల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..