Share News

మూడేళ్లుగా కనిపించని భర్త.. కంటపడగానే చితకబాదిన భార్య

ABN , Publish Date - Oct 03 , 2026 | 11:51 AM

ఉద్యోగం పేరుతో 3 సంవత్సరాలుగా కనిపించకుండా తిరుగుతున్న ఓ భర్తను భార్య చితకబాదిన ఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..

మూడేళ్లుగా కనిపించని భర్త.. కంటపడగానే చితకబాదిన భార్య
wife attacks husband in krishna district

కృష్ణా జిల్లా, అక్టోబర్ 3: ఉద్యోగం పేరుతో మూడేళ్లుగా కుటుంబాన్ని వదిలేసి తప్పించుకుని తిరుగుతున్న భర్తను.. అతడి భార్య, కొడుకు కలిసి చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు.


పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. కృష్ణా జిల్లా గన్నవరం మండలంలోని కేసరపల్లి సుందరయ్య కాలనీకి చెందిన దేవరకొండ నరేంద్రకు విజయవాడకు చెందిన ప్రియాంకకు 2012లో వివాహం జరిగింది. వీరికి 2013లో ఒక బాబు జన్మించాడు. అయితే.. కొంతకాలంగా నరేంద్ర బాబు.. భార్యను వదిలేసి, ఉద్యోగం పేరుతో హైదరాబాద్, బెంగుళూరు, దుబాయ్.. అంటూ ఇంటికి రాకుండా తిరుగుతున్నాడు. నరేంద్ర కోసం ప్రియాంక తన కుమారుడితో కలిసి చాలా చోట్ల వెతికినప్పటికీ జాడ తెలియలేదు. విసిగిపోయిన ప్రియాంక.. గతంలో నరేంద్రపై మాచవరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.


కాగా.. నరేంద్ర తమ కాలనీలోని ఓ ఇంట్లో వేరే మహిళతో ఉండగా.. ప్రియాంక కంటపడింది. దీంతో కోపంతో రగిలిపోయిన ప్రియాంక.. తన భర్తను చితకబాదింది. కుమారుడు కూడా తన తండ్రిపై దాడి చేశాడు. అనంతరం.. ప్రియాంక తన భర్త నరేంద్రను గన్నవరం పోలీస్ స్టేషన్‌లో అప్పగించింది.


ఇవి కూడా చదవండి..

మేడ్చల్‌లో రోడ్డు ప్రమాదం.. బైక్‌ను ఢీకొన్న కారు, భర్త మృతి

‘మీ ధైర్యసాహసాలకు వందనాలు’.. కెప్టెన్ స్మిత్ మచ్చార్‌‌పై చిరంజీవి ప్రశంసలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 03 , 2026 | 11:58 AM