Share News

సచివాలయ ఉద్యోగులపై ప్రభుత్వం సీరియస్.. 46 మందికి షోకాజ్ నోటీసులు

ABN , Publish Date - Oct 03 , 2026 | 03:51 PM

విజయవాడలో ఆందోళన నిర్వహించిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులపై ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. ఆందోళనలలో కీలకంగా వ్యవహరించిన 46 మందిని గుర్తించిన పోలీసు వర్గాలు.. వారి వివరాలతో ప్రభుత్వానికి నివేదికను అందించినట్లు సమాచారం.

సచివాలయ ఉద్యోగులపై ప్రభుత్వం సీరియస్.. 46 మందికి షోకాజ్ నోటీసులు
AP government

అమరావతి, అక్టోబర్ 3: విజయవాడలో ఆందోళన నిర్వహించిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులపై ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. ఆందోళనలలో కీలకంగా వ్యవహరించిన 46 మందిని గుర్తించిన పోలీసు వర్గాలు.. వారి వివరాలతో ప్రభుత్వానికి నివేదికను అందించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఈ 46 మందికి షోకాజ్ నోటీసులు ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆందోళనలో పాల్గొన్న 46 మంది ఉద్యోగుల జాబితాను జిల్లా కలెక్టర్లకు ఉన్నతాధికారులు పంపించారు. సోమవారం సాయంత్రంలోపు ఆయా ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు పంపించాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులపై చర్యలు తీసుకునే అధికారం కలెక్టర్లకు ఉండడంతో.. ఈ జాబితాను వారికి పంపినట్లు సమాచారం.


దీంతో ఇప్పటికే ఆయా జిల్లాల్లో ఉద్యోగులకు కలెక్టర్లు షోకాజ్ నోటీసులు పంపుతున్నట్లు తెలుస్తోంది. షోకాజ్ నోటీసులకు వారు ఇచ్చే వివరణ తరువాత న్యాయనిపుణులతో పరిశీలించి తదనంతర చర్యలు తీసుకోవాలని సర్కార్ ఆదేశించింది. కాగా, ఆందోళనలో పాల్గొన్న 46 మందిలో ఇప్పటికే ఒకరిద్దరిపై అధికారులు సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ ఉద్యోగులపై క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే కేసులు కూడా నమోదు చేయాలని విజయవాడ పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం.


ఇవి కూడా చదవండి..

యువతిపై దాడి చేసి.. భవనంపై నుంచి దూకి యువకుడి ఆత్మహత్య

విజయవాడలో ప్రేమోన్మాది దాడి ఘటన.. చికిత్స పొందుతూ యువతి మృతి

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 03 , 2026 | 04:14 PM