Share News

విజయవాడలో ప్రేమోన్మాది దాడి ఘటన.. చికిత్స పొందుతూ యువతి మృతి

ABN , Publish Date - Oct 03 , 2026 | 03:04 PM

బెజవాడ ప్రేమోన్మాది దాడి ఘటనలో విషాదం నెలకొంది. యువకుడి దాడిలో తీవ్రంగా గాయపడిన యువతి చికిత్స పొందుతూ మృతిచెందింది.

విజయవాడలో ప్రేమోన్మాది దాడి ఘటన.. చికిత్స పొందుతూ యువతి మృతి
Vijayawada News

విజయవాడ, అక్టోబర్ 3: బెజవాడ ప్రేమోన్మాది దాడి ఘటనలో విషాదం నెలకొంది. యువకుడి దాడిలో తీవ్రంగా గాయపడిన యువతి చికిత్స పొందుతూ మృతిచెందింది. ఈరోజు(శనివారం) న్యూ రాజరాజేశ్వరి పేటలో 19 ఏళ్ల యువతిపై చిన్నా అనే యువకుడు కత్తితో దాడి చేశాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దారుణానికి తెగబడ్డాడు. ప్రేమోన్మాది దాడిలో సదరు యువతి తీవ్రంగా గాయపడింది. యువతి అరుపులు విన్న వెంటనే కుటుంబసభ్యులు అక్కడకు వచ్చి చూడగా.. ఆమె రక్తపుమడుగులో కనిపించింది. దీంతో యువతిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.


యువతిపై ప్రేమోన్మాది కత్తితో మూడు చోట్ల గాయపరచడంతో వైద్యులు చికిత్స అందించారు. తీవ్రంగా గాయపడిన ఆమె ఆస్పత్రిలో కొన ఊపిరితో పోరాడింది. చివరకు పరిస్థితి విషమించడంతో మృతిచెందింది. అయితే యువతిపై దాడి అనంతరం ప్రేమోన్మాది.. పక్కనే ఉన్న భవనంపై నుంచి కిందకు దూకాడు. దీంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రేమోన్మాది దాడిలో యువతి మృతిచెందిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.


ఇవి కూడా చదవండి..

శ్రీసిటీ బాయిలర్ పేలుడు.. సేఫ్టీ ఆడిట్‌కు పవన్ కల్యాణ్ ఆదేశాలు

యువతిపై దాడి చేసి.. భవనంపై నుంచి దూకి యువకుడి ఆత్మహత్య

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 03 , 2026 | 04:09 PM