ఆసియా క్రికెట్: భారత్ ఖాతాలో మరో స్వర్ణం.. పాక్‌పై భారత్ విజయం
ABN , Publish Date - Oct 03 , 2026 | 01:33 PM
ఆసియా గేమ్స్‌లో భారత్ ఖాతాలో మరో పసిడి చేరింది. పురుషుల క్రికెట్‌లో పాకిస్థాన్‌పై భారత్ 19 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఇంటర్నెట్ డెస్క్: ఆసియా గేమ్స్‌లో భాగంగా భారత్ ఖాతాలో 19వ గోల్డ్ మెడల్ చేరింది. నేడు పాక్‌తో జరిగిన పురుషుల క్రికెట్లో భారత్ విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 6 వికెట్ల నష్టానికి 211 పరుగులు సాధించింది. భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాక్ తడబడింది. 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 192 పరుగులకే పరిమితమైంది. దీంతో 19 పరుగుల తేడాతో టీమ్ఇండియా గెలుపొంది.. మరోసారి పసిడి పతకాన్ని ముద్దాడింది.
కోరోగి స్పోర్ట్స్ పార్క్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో పాక్‌పై మరోసారి పైచేయి సాధించింది టీమ్ఇండియా. అభిషేక్ శర్మ 61 (28 బంతుల్లో; 3 ఫోర్లు, 7 సిక్స్‌లు), తిలక్ వర్మ 51* (22 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) చెలరేగడంతో ప్రత్యర్థి ముందు భారీ టార్గెట్‌ను ఉంచింది. అహ్మద్ డేనియల్, అరాఫత్ మిన్హాస్ తలో 2 వికెట్లు తీయగా.. సైమ్ ఆయుబ్, అబ్రార్ అహ్మద్ తలో వికెట్ తీశారు.
భారీ టార్గెట్‌ను ఛేదించే క్రమంలో పాక్ ఆదిలోనే తడబడింది. పవర్ ప్లేలో 2 వికెట్లు కోల్పోయి 39 పరుగులు మాత్రమే చేసింది. నాల్గో నంబర్ బ్యాటర్ హాసన్ నవాజ్ 96 (51 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్స్‌లు) చెలరేగి ఆడటంతో ఓవైపు ఉత్కంఠ చెలరేగింది. అయితే.. పట్టుకోల్పోని భారత బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్ల తీస్తూ పరుగులను నియంత్రించారు. అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబె చెరో 2 వికెట్లు తీశారు. దీంతో దాయాది దేశానికి మరోసారి నిరాశను మిగుల్చుతూ.. స్వర్ణాన్ని నిలబెట్టుకుంది టీమ్ఇండియా.
ఇవీ చదవండి:
పాక్‌తో మ్యాచ్‌లో హ్యాండ్‌షేక్‌కు దూరంగా భారత్.. ఎందుకిలా.?
వైభవ్‌ను ఔట్ చేసి ఆయుబ్ వికృత చేష్టలు.. గట్టిగా బదులిచ్చిన భారత బ్యాటర్లు