వైభవ్‌ను ఔట్ చేసి ఆయుబ్ వికృత చేష్టలు.. గట్టిగా బదులిచ్చిన భారత బ్యాటర్లు
ABN , Publish Date - Oct 03 , 2026 | 12:35 PM
వైభవ్ సూర్యవంశీని ఔట్ చేసిన తర్వాత సైమ్ ఆయుబ్ సంబరాలు చేసుకున్నాడు. అయితే అతడి బౌలింగ్‌లోనే అభిషేక్ శర్మ 2 బౌండరీలు, ఓ సిక్సర్ బాది బదులిచ్చాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఆసియా క్రీడల్లో భాగంగా పసిడి కోసం పాక్‌తో తలపడిన భారత్.. ఫస్ట్ బ్యాటింగ్ చేసి 6 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చిన వైభవ్ సూర్యవంశీ 9 బంతుల్లో 2 సిక్సర్లతో 15 పరుగులు చేసి సైమ్ ఆయుబ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. రివర్స్ స్వీప్ ఆడేందుకు యత్నించగా బంతి బ్యాట్ అంచును తాకుతూ వికెట్ కీపర్ ఉస్మాన్ ఖాన్ చేతుల్లో పడింది. దీంతో బేబీ బాస్ వెనుదిరగాల్సి వచ్చింది. వైభవ్ పెవిలియన్‌కు వెళ్తుండగా.. ఆయుబ్ ఒళ్లో పిల్లల్ని ఆడించినట్టుగా సైగలతో సెండాఫ్ ఇస్తూ సంబరాలు చేసుకున్నాడు. అయితే.. ఆ తర్వాత వెంటనే అతడి బౌలింగ్‌లో 2 బౌండరీలు, ఓ సిక్సర్ బాది గట్టిగా బదులిచ్చాడు అభిషేక్.
ఈ మ్యాచ్‌లో వైభవ్ వికెట్ తీయడం తప్ప చెప్పుకోదగ్గ ప్రదర్శనేమీ చేయలేదు ఆయుబ్. 4 ఓవర్లలో 47 పరుగులు(11.80 ఎకానమీ) సమర్పించుకున్నాడు. అతడి బౌలింగ్‌లో శివమ్ దూబే 2 సిక్సర్లు, 1 ఫోర్ దంచగా.. తిలక్ వర్మ కూడా ఒక బౌండరీతో విరుచుకుపడ్డాడు. అలా మొత్తంగా ఆయుబ్‌పై భారత బ్యాటర్లు పైచేయి సాధించారు.
ఇవీ చదవండి:
ఆసియాడ్ క్రికెట్: అభిషేక్, తిలక్ హాఫ్ సెంచరీలు.. పాకిస్థాన్ టార్గెట్ ఎంతంటే?
ఆసియా క్రీడలు: ప్రణవి శరత్ సంచలనం.. గోల్ఫ్‌లో భారత్‌కు తొలి స్వర్ణం