పారా ఆసియా క్రీడల్లో భారత్ జోరు.. ఖాతాలో 54 పతకాలు
ABN , Publish Date - Oct 21 , 2026 | 04:23 PM
జపాన్ వేదికగా జరుగుతున్న పారా ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లు సత్తా చాటుతున్నారు. తాజాగా పారా అథ్లెట్ సిమ్రాన్ టీ12 విభాగంలో 100 మీటర్ల స్ప్రింట్ ఈవెంట్‌లో స్వర్ణం పతకం సాధించింది.
ఇంటర్నెట్ డెస్క్: జపాన్ వేదికగా జరుగుతున్న పారా ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లు సత్తా చాటుతున్నారు. తాజాగా పారా అథ్లెట్ సిమ్రాన్ టీ12 విభాగంలో 100 మీటర్ల స్ప్రింట్ ఈవెంట్‌లో స్వర్ణం పతకం సాధించింది. సిమ్రాన్ మంగళవారం జరిగిన 200 మీటర్ల ఈవెంట్‌లోనూ పసిడి పతకం కైవసం చేసుకుంది. దీంతో ఈసారి ఆమె బ్యాక్ టూ బ్యాక్ రెండు స్వర్ణాలు అందుకోవడం విశేషం.
మరోవైపు పురుషుల టీ47 విభాగంలో 100 మీటర్ల స్ప్రింట్ పోటీలో భారత అథ్లెట్ దిలీప్ స్వర్ణం గెలుచుకున్నాడు. ఇక పురుషుల 400 మీటర్ల టీ35/38 ఈవెంట్‌లో భారత అథ్లెట్ అకీరా నందన్ బానోతు రజతం సాధించాడు. 51.25 సెకన్లలో రేసును పూర్తి చేసింది రెండో స్థానంలో నిలిచాడు. దీంతో భారత్ ఖాతాలో ఇప్పటివరకు 14 స్వర్ణాలు, 20 రజతాలు, 20 కాంస్య పతకాలు చేరాయి. 54 పతకాలతో భారత్.. పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది.
ఇవి కూడా చదవండి..
ఒక్క గ్రాము యురేనియం కూడా ఇవ్వం.. అమెరికాకు తేల్చి చెప్పిన ఇరాన్..
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..