టీమిండియాకు భారీ షాక్.. వచ్చే ఐపీఎల్ వరకు హార్దిక్ పాండ్యా ఆడేది లేదా..
ABN , Publish Date - Oct 21 , 2026 | 12:24 PM
భారత క్రికెట్ జట్టుకు బ్యాడ్ న్యూస్. స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మళ్లీ మైదానంలోకి రావడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: భారత క్రికెట్ జట్టుకు బ్యాడ్ న్యూస్. స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మళ్లీ మైదానంలోకి రావడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుత గాయం నుంచి కోలుకోవడానికి పాండ్యాకు చాలా సమయం అవసరమని, అతడు నేరుగా వచ్చే ఏడాది ఐపీఎల్‌లోనే ఆడే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి (Hardik Pandya Comeback).
హార్దిక్ పాండ్యా ఈ ఏడాది ఐపీఎల్ చివరి దశలో వెన్నునొప్పి సమస్యతో ఇబ్బంది పడ్డాడు. అనంతరం భారత జట్టు తరఫున ఆడేందుకు సిద్ధమవుతున్న సమయంలో తొడ కండరానికి గాయమైంది. దాని నుంచి కోలుకునే ప్రక్రియలో మరోసారి కాలి కింది భాగంలో నొప్పి మొదలైంది. ఈ గాయాల కారణంగా అతడు పలు అంతర్జాతీయ సిరీస్‌లకు దూరమయ్యాడు. ప్రస్తుతం వైద్యుల సూచన మేరకు పాండ్యా విశ్రాంతి తీసుకుంటున్నాడు. గాయంపై అదనపు ఒత్తిడి పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు (Hardik Pandya Injury).
తాజా సమాచారం ప్రకారం, వచ్చే ఏడాది ఐపీఎల్ వరకు పాండ్యా క్రికెట్‌కు దూరంగా ఉండే అవకాశం ఉంది (Hardik Pandya Fitness). అతడు కోలుకునే వేగం, వైద్య పరీక్షల ఫలితాలు, ఫిట్నెస్ ఆధారంగానే అతడిని ఆడించడంపై నిర్ణయం తీసుకోనున్నారు. 2027 వన్డే ప్రపంచకప్‌నకు భారత్ సన్నద్ధమవుతున్న తరుణంలో హార్దిక్ అందుబాటులో లేకపోవడం జట్టుకు ఆందోళన కలిగించే అంశం. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ సేవలందించగల పాండ్యాకు ప్రత్యామ్నాయాన్ని కనుగొనడం జట్టు యాజమాన్యానికి పెద్ద సవాలు అని చెప్పక తప్పదు.
ఇవి కూడా చదవండి..
ఒక్క గ్రాము యురేనియం కూడా ఇవ్వం.. అమెరికాకు తేల్చి చెప్పిన ఇరాన్..
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..