Share News

నాలుగేళ్ల తర్వాత టీమిండియాలోకి భువనేశ్వర్.. ఎందుకో చెప్పిన శ్రేయస్..

ABN , Publish Date - Oct 21 , 2026 | 11:24 AM

టీమిండియా సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌ను నాలుగేళ్ల తర్వాత మళ్లీ జట్టులోకి తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. భువనేశ్వర్ కుమార్ చివరిసారిగా 2022 నవంబర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లో భారత్ తరఫున ఆడాడు.

నాలుగేళ్ల తర్వాత టీమిండియాలోకి భువనేశ్వర్.. ఎందుకో చెప్పిన శ్రేయస్..
Bhuvneshwar Kumar, Shreyas Iyer

ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌ను నాలుగేళ్ల తర్వాత మళ్లీ జట్టులోకి తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. భువనేశ్వర్ కుమార్ చివరిసారిగా 2022 నవంబర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లో భారత్ తరఫున ఆడాడు. ఆ తర్వాత జాతీయ జట్టుకు దూరమయ్యాడు. అయితే ఐపీఎల్‌లో నిలకడైన ప్రదర్శనతో మరోసారి సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు అతడిని ఎంపిక చేశారు (Bhuvneshwar Kumar Comeback).


దాదాపు నాలుగేళ్ల తర్వాత భువనేశ్వర్ కుమార్‌ను జట్టులోకి తీసుకోవడంపై టీమిండియా టీ-20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్పందించాడు. 'భువనేశ్వర్ కుమార్ జట్టుకు ఎంతో అనుభవాన్ని తీసుకొస్తాడు. ఇటీవల జట్టులోకి వచ్చిన బౌలర్లందరూ కొత్తవాళ్లే. ఒత్తిడి సమయంలో రాణించడం ఎలాగో వారికి పూర్తిగా తెలియదు. భువి వంటి సీనియర్ బౌలర్ జట్టులో ఉండటం ఎంతో ఉపయోగకరం. కొత్త బంతితో స్వింగ్ రాబట్టడంతో పాటు ఒత్తిడిలోనూ భువి అద్భుతంగా బౌలింగ్ చేయగలడు' అని అయ్యర్ పేర్కొన్నాడు ( Iyer about Bhuvi).


భువనేశ్వర్ తిరిగి జట్టులోకి రావడంతో పోటీ పెరుగుతుందని శ్రేయస్ అయ్యర్ అన్నాడు (India vs New Zealand T20 Series). తుది జట్టులో ఎవరిని ఎంపిక చేయాలనే విషయంలో జట్టు యాజమాన్యానికి కొంత తలనొప్పి తప్పదని అన్నాడు. 'గత సీజన్లలో ఐపీఎల్ టైటిళ్లు గెలిచిన జట్టులో అతడు కీలక ఆటగాడిగా ఉన్నాడు. టీ-20 ఫార్మాట్‌లో ఎలా ఆధిపత్యం ప్రదర్శించాలో భువనేశ్వర్‌కు మంచి అవగాహన ఉంది. అనుభవం, నైపుణ్యం కలిగిన బౌలర్ తిరిగి జట్టులోకి రావడం భారత బౌలింగ్ విభాగానికి బలాన్నిస్తుంది. అదే సమయంలో ఇతర బౌలర్లు కూడా తమ స్థానాలను నిలబెట్టుకోవాలంటే నిలకడగా రాణించాల్సి ఉంటుంది' అని అయ్యర్ సూచించాడు.


ఇవి కూడా చదవండి..

ఒక్క గ్రాము యురేనియం కూడా ఇవ్వం.. అమెరికాకు తేల్చి చెప్పిన ఇరాన్..


స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

Updated Date - Oct 21 , 2026 | 11:29 AM