Share News

60 ఏళ్ల నాటి రికార్డును బద్దలు కొట్టిన ప్రొటీస్ ఆల్‌రౌండర్..

ABN , Publish Date - Oct 20 , 2026 | 09:56 PM

ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ మార్కో జాన్సన్(85)చక్కటి ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. తృటిలో సెంచరీ మిస్ చేసుకున్న మార్క్.. ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

60 ఏళ్ల నాటి రికార్డును బద్దలు కొట్టిన ప్రొటీస్ ఆల్‌రౌండర్..
Marco Jansen

ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ మార్కో జాన్సన్(85)చక్కటి ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. తృటిలో సెంచరీ మిస్ చేసుకున్న మార్క్.. ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అంతేకాక దాదాపు 60 ఏళ్ల తర్వాత ఈ ఘనత సాధించిన ప్రొటీస్ ప్లేయర్ గా మార్క్ నిలిచాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే...


గ్కెబెర్హా వేదికగా కంగారు జట్టుతో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ మూడో రోజున ప్రొటిస్ జట్టు 110 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి.. పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన జాన్సన్.. కెప్టెన్ టెంబా బావుమాతో కలిసి అద్భుత భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. మార్కో జట్టును ఆదుకోవడమే కాకుండా కీలకమైన 132 పరుగుల భాగస్వామ్యంలో కీలక పాత్ర పోషించాడు. కేవలం 100 బంతుల్లోనే 85 పరుగులు బాదిన జాన్సన్.. స్కాట్ బోలాండ్ బౌలింగ్‌లో ట్రావిస్ హెడ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. తృటిలో సెంచరీ కోల్పోయినప్పటికీ, సొంతగడ్డపై ఆస్ట్రేలియాపై టెస్టులో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి.. బరిలోకి దిగి అత్యధిక పరుగులు సాధించిన సౌతాఫ్రికా బ్యాటర్‌గా జాన్సన్ రికార్డు సృష్టించాడు.


ఇంతకుముందు 1966లో జోహెన్నెస్‌బర్గ్‌లో పీటర్ వాన్ డెర్ మెర్వె ఎనిమిదో స్థానంలో బరిలోకి దిగి 76 పరుగులు సాధించాడు. 66 ఏళ్ల తర్వాత ఆ రికార్డును జాన్సన్ అధిగమించాడు. అలాగే, ఆస్ట్రేలియాతో టెస్టు ఇన్నింగ్స్‌లో ఎనిమిదో స్థానంలో అత్యధిక పరుగులు చేసిన సౌతాఫ్రికా బ్యాటర్ల జాబితాలో బ్రియాన్ మెక్‌మిలన్ (అజేయంగా 87 పరుగులు, 1998) తొలి స్థానంలో ఉండగా.. జాన్సన్ కేవలం 3 పరుగుల దూరంతో రెండో స్థానంలో నిలిచాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. సౌతాఫ్రికా 9 వికెట్లు కోల్పోయి.. 425 పరుగుల వద్ద డిక్లేర్ ఇచ్చింది. కెప్టెన్ టెంబా బావుమా 334 బంతుల్లో 179 పరుగులు చేసి.. ప్రొటీస్ జట్టు భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు.


ఈ వార్తలనూ చదవండి:

ట్రేడ్ డీల్‌ వల్ల భారత్‌కు సుంకాల నుంచి మినహాయింపు: మార్కో రూబియో

ఎన్నికల్లో మోసం.. యూఎస్ గ్రీన్‌ కార్డు ఉన్న భారతీయులపై కేసు

ఆస్ట్రేలియాపై బావుమా సెంచరీ.. రోహిత్ శర్మ రికార్డు బద్దలు!

Updated Date - Oct 20 , 2026 | 10:01 PM