Share News

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో సత్తా చాటిన టీమిండియా మహిళా ప్లేయర్లు

ABN , Publish Date - Oct 20 , 2026 | 07:11 PM

జింబాబ్వేతో జరుగుతున్న మహిళల టీ20 సిరీస్‌లో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న భారత యువ బౌలర్లు నందిని శర్మ, క్రాంతి గౌడ్ తాజాగా విడుదలైన ఐసీసీ టీ20ఐ ర్యాంకింగ్స్‌లో మెరుగైన స్థానాలను సొంతం చేసుకున్నారు.

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో సత్తా చాటిన టీమిండియా మహిళా ప్లేయర్లు
Nandini Sharma

స్పోర్ట్స్ డెస్క్: జింబాబ్వేతో జరుగుతున్న మహిళల టీ20 సిరీస్‌లో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న భారత యువ బౌలర్లు నందిని శర్మ, క్రాంతి గౌడ్ తాజా ఐసీసీ టీ20ఐ ర్యాంకింగ్స్‌లో మెరుగైన స్థానాలను సొంతం చేసుకున్నారు. జింబాబ్వేతో జరిగిన తొలి రెండు టీ20 మ్యాచ్‌లలో మూడు వికెట్లు పడగొట్టిన నందిని శర్మ ఏకంగా 26 స్థానాలు ఎగబాకి 45వ స్థానానికి చేరుకుంది. అంతేకాకుండా ఆమె తన కెరీర్‌లో అత్యధికంగా 507 రేటింగ్ పాయింట్లను సాధించింది. మరోవైపు, తొలి రెండు మ్యాచ్‌ల్లో ఒక్కో వికెట్ తీసిన క్రాంతి గౌడ్ తొమ్మిది స్థానాలు మెరుగుపర్చుకుని 43వ స్థానానికి చేరుకుంది.


మరోవైపు బ్యాటింగ్ విభాగంలోనూ భారత మహిళా ప్లేయర్లు తమ స్థానాలను మెరుగుపరుచుకున్నారు. రెండో టీ20లో 25 బంతుల్లోనే 55 పరుగులతో చెలరేగిన స్టార్ ఓపెనర్ షఫాలీ వర్మ తన నాలుగో స్థానాన్ని పదిలం చేసుకుంది. తొలి మ్యాచ్‌లో 37 బంతుల్లో 49 పరుగులు చేసిన ఆల్ రౌండర్ దీప్తి శర్మ ఒక స్థానం ఎగబాకి సంయుక్త 37వ స్థానాన్ని దక్కించుకున్నాడు.


మరోవైపు సిరీస్‌లో వెనుకబడినప్పటికీ జింబాబ్వే బ్యాటర్లు కూడా ర్యాంకింగ్స్‌లో పురోగతి సాధించాడు. కెలిస్ 64వ స్థానానికి, చిపో ముగెరి-తిరిపానో 73వ స్థానానికి ఎగబాకగా.. తొలి మ్యాచ్‌లో అజేయంగా 43 పరుగులు చేసిన షార్నే మేయర్స్ టాప్-100లోకి ప్రవేశించి 96వ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. భారత మహిళా క్రికెటర్ల ఐసీసీ ర్యాకింగ్స్‌లో మెరుగైన ఫలితాలను సాధించడంపై క్రీడా వర్గాల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి.


ఇవి కూడా చదవండి:

పాకిస్థాన్, శ్రీలంకకు ఐసీసీ జరిమానా.. కారణమిదే!

సూర్యాపేట సూపర్ మార్కెట్‌లో పేలిన గ్యాస్ సిలిండర్.. భారీగా ఆస్తి నష్టం

రీల్స్‌ మోజులో చిన్నారిని పట్టించుకోని తల్లిదండ్రులు.. చివరికి..

Updated Date - Oct 20 , 2026 | 08:13 PM