పాకిస్థాన్, శ్రీలంకకు ఐసీసీ జరిమానా.. కారణమిదే!
ABN , Publish Date - Oct 20 , 2026 | 02:54 PM
పాకిస్తాన్, శ్రీలంక జట్లకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) భారీ షాకిచ్చింది. ముక్కోణపు వన్డే సిరీస్ భాగంగా ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా జరిమానా పడింది.
ఇంటర్నెట్ డెస్క్: పాకిస్తాన్, శ్రీలంక జట్లకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) భారీ షాకిచ్చింది. ముక్కోణపు వన్డే సిరీస్ భాగంగా ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా జరిమానా పడింది. పాక్ ప్లేయర్ల మ్యాచ్ ఫీజులో 10 శాతం, లంక ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 5 శాతం కోత విధిస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది. పాక్ నిర్ణీత సమయానికి రెండు ఓవర్లు తక్కువ వేయగా.. శ్రీలంక ఒక ఓవర్ వెనుకబడింది. దీంతో ఐసీసీ నిబంధనల ప్రకారం ఈ జరిమానా పడింది.
ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం నిర్ణీత సమయంలో వేయలేకపోయిన ప్రతి ఓవర్‌కు ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 5 శాతం జరిమానా విధిస్తారు. అలానే ఇరు జట్ల కెప్టెన్లు షాహీన్ అఫ్రిదీ, కుశల్ మెండిస్.. తమపై వచ్చిన ఆరోపణలను అంగీకరించడంతో అధికారిక విచారణ అవసరం లేకుండా పోయింది. బర్మింగ్‌హామ్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన మూడవ టెస్టులో నెమ్మదిగా ఓవర్లు వేసినందుకు పాకిస్థాన్‌కు వారి మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధించిందిన సంగతి తెలిసిందే. తాజాగా ట్రై సిరీస్ లో పాకిస్థాన్ కు మరోసారి జరిమానా పడింది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే... స్వదేశంలో జరుగుతున్న ట్రై సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆ జట్టు 305 పరుగులు చేయగా.. లక్ష్య ఛేదనలో శ్రీలంక 268 పరుగులకే ఆలౌటైంది. దీంతో పాక్ 38 పరుగుల తేడాతో లంకను ఓడించింది. సల్మాన్ ఆఘా(107) తన వన్డే కెరీర్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించి పాక్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. బౌలింగ్‌లో కెప్టెన్ షాహీన్ అఫ్రిదీ మూడు వికెట్లు పడగొట్టగా.. హారిస్ రవూఫ్, నసీమ్ షా, ఫహీమ్ అష్రఫ్ తలో రెండు వికెట్లు తీసుకున్నారు. పాకిస్థాన్, ఇంగ్లాండ్, శ్రీలంక మధ్య ట్రై సిరీస్ జరుగుతోంది.
ఇవి కూడా చదవండి:
పారా ఆసియా గేమ్స్: అథ్లెటిక్స్‌లో తెలంగాణ బిడ్డ దీప్తి జీవాంజీకి స్వర్ణం
ఇషాన్ కిషన్ వల్లే యశస్వికి జట్టులో చోటు దక్కడం లేదు: ఆకాశ్ చోప్రా
అబద్ధాలు చెప్పి అలసిపోయి వియత్నాం వెళ్తున్నారు.. రాహుల్ గాంధీపై బీజేపీ సెటైర్లు..