Share News

అబద్ధాలు చెప్పి అలసిపోయి వియత్నాం వెళ్తున్నారు.. రాహుల్ గాంధీపై బీజేపీ సెటైర్లు..

ABN , Publish Date - Oct 20 , 2026 | 01:57 PM

కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీపై భారతీయ జనతా పార్టీ విమర్శలు గుప్పించింది. ఆయన వియత్నాం పర్యటనకు వెళ్లినట్లు ఆరోపిస్తూ ఓ వీడియోను సోషల్ మీడియాలో పంచుకుంది.

అబద్ధాలు చెప్పి అలసిపోయి వియత్నాం వెళ్తున్నారు.. రాహుల్ గాంధీపై బీజేపీ సెటైర్లు..
Rahul Gandhi

ఇంటర్నెట్ డెస్క్: కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీపై భారతీయ జనతా పార్టీ (BJP) విమర్శలు గుప్పించింది. ఆయన వియత్నాం పర్యటనకు వెళ్లినట్లు ఆరోపిస్తూ ఓ వీడియోను సోషల్ మీడియాలో పంచుకుంది. దేశంలో ప్రతిపక్ష కూటమి నిరసనలు కొనసాగుతున్న సమయంలో రాహుల్ విదేశీ పర్యటనకు వెళ్లడంపై వ్యంగ్యాస్త్రాలు సంధించింది. దీనిపై కాంగ్రెస్ నేతలు స్పందిస్తూ, రాహుల్ ఎక్కడికి వెళ్తే బీజేపీకి ఎందుకని ప్రశ్నించారు (Rahul Gandhi Vietnam trip).


అక్టోబర్ 19న బీజేపీ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో ఓ వీడియోను పోస్టు చేసింది. ఆ వీడియోలో రాహుల్ గాంధీ విమానంలో కూర్చుని కనిపిస్తున్నారు. 'అబద్ధాలు ప్రచారం చేసి అలసిపోయా.. కొన్ని రోజులు వియత్నాం తిరిగి వస్తా.. ఎవరికి తెలుస్తుంది?' అని రాహుల్ గాంధీ భావిస్తున్నట్టు అర్థం వచ్చేలా వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది. ప్రతిపక్షాలు ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న సమయంలో రాహుల్ విదేశాలకు వెళ్లారని బీజేపీ నేతలు విమర్శించారు. ఆయన రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనడం కంటే విదేశీ పర్యటనలకు ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు (ahul Gandhi foreign visit).


బీజేపీ విమర్శలను కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్ తిప్పికొట్టారు (BJP vs Congress). రాహుల్ గాంధీ ఎక్కడికి వెళ్లినా బీజేపీ అనవసరంగా వివాదం సృష్టిస్తోందని అన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్‌కు కొన్ని బాధ్యతలు ఉన్నాయని, విదేశీ విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులతో సమావేశాలు కావడం, మేధావులతో చర్చించడం, మీడియా ఇంటర్వ్యూలు ఇవ్వడం కూడా ఆయన కార్యక్రమాల్లో భాగమని వివరించారు. ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు కూడా ఇలాంటి ప్రశ్నలు వేస్తారా అని సందీప్ దీక్షిత్ ప్రశ్నించారు.


ఇవి కూడా చదవండి..

త్వరలోనే పారిస్ ముస్లిం నగరంగా మారుతుంది.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..


స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

Updated Date - Oct 20 , 2026 | 02:02 PM