త్వరలోనే పారిస్ ముస్లిం నగరంగా మారుతుంది.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..
ABN , Publish Date - Oct 20 , 2026 | 07:30 AM
ఫ్రాన్స్‌లో నిరసనలు, హింసాత్మక ఘటనలు కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పారిస్ త్వరలో ముస్లిం నగరంగా మారుతుందని వ్యాఖ్యానించారు.
ఇంటర్నెట్ డెస్క్: ఫ్రాన్స్‌లో నిరసనలు, హింసాత్మక ఘటనలు కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పారిస్ త్వరలో ముస్లిం నగరంగా మారుతుందని వ్యాఖ్యానించారు. ఫ్రాన్స్‌లో చోటుచేసుకుంటున్న అల్లర్లకు వలస విధానాలే కారణమని ఆరోపించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ సరిహద్దులను కట్టుదిట్టం చేయాలని సూచించారు (Donald Trump about Paris).
ఫ్రాన్స్‌లో ఇటీవల జరిగిన నిరసనలు, హింసాత్మక ఘటనలపై ట్రంప్ స్పందించారు. ఈ పరిణామాలకు పాఠశాలలు లేదా ఇతర అంశాలు కారణం కాదని, వలసలే ప్రధాన కారణమని పేర్కొన్నారు. ఫ్రాన్స్‌లోకి ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలను అనుమతించడం పెద్ద తప్పిదమని గతంలోనే మాక్రాన్‌కు చెప్పినట్లు వెల్లడించారు. 'పారిస్ త్వరలోనే ముస్లిం నగరంగా మారబోతోంది. అది మనం కోరుకున్నది కాదు' అని ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికా తన సరిహద్దులను కట్టుదిట్టం చేసుకుందని, ఫ్రాన్స్ కూడా అదే విధంగా వ్యవహరించాల్సి ఉందని అన్నారు (Paris Muslim city).
యూరప్ దేశాలు తమ సరిహద్దులను కట్టుదిట్టం చేయాలని ట్రంప్ సూచించారు (France protests 2026). అక్రమ వలసలను అరికట్టడంతో పాటు నేరాలకు పాల్పడేవారిపై చర్యలు తీసుకోవాలని అన్నారు. లేదంటే యూరప్ తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఫ్రాన్స్‌లో జీవన వ్యయం, ధరల పెరుగుదల వంటి అంశాలపై ఇటీవల నిరసనలు జరిగాయి. పారిస్‌తో పాటు ఇతర నగరాల్లోనూ ఆందోళనలు చోటుచేసుకున్నాయి. కొన్ని ప్రాంతాల్లో నిరసనలు హింసాత్మకంగా మారడంతో దుకాణాలు, ఇతర ఆస్తులకు నష్టం వాటిల్లింది.
ఈ వార్తలు కూడా చదవండి
హూతీల దాడిలో 53 మంది యెమెన్ సైనికులు మృతి
కార్మిక సంక్షేమ చట్టం.. 5 వేల ఉద్యోగాలకు ఎసరు!