హూతీల దాడిలో 53 మంది యెమెన్ సైనికులు మృతి
ABN , Publish Date - Oct 20 , 2026 | 06:20 AM
యెమెన్‌లోని షబ్వాలో ఉన్న అల్ ఆలమ్ మిలిటరీ క్యాంప్‌పై హూతీ తిరుగుబాటుదారులు జరిపిన బాలిస్టిక్ క్షిపణుల దాడుల్లో 53 మంది సైనికులు మృతిచెందారు.
సనా, అక్టోబరు 19: యెమెన్‌లోని షబ్వాలో ఉన్న అల్ ఆలమ్ మిలిటరీ క్యాంప్‌పై హూతీ తిరుగుబాటుదారులు జరిపిన బాలిస్టిక్ క్షిపణుల దాడుల్లో 53 మంది సైనికులు మృతిచెందారు. 200 మందికి పైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇలా ఉండగా యెమెన్ ప్రభుత్వ బలగాలు తైజ్ నగరంలోని అల్ అఖ్రౌధ్, అల్ షబాబ్, అల్ సరారీ ప్రాంతాల్లోని హూతీల స్థావరాలు, వాహనాలు, ఆయుధ కేంద్రాలపై దాడులు జరిపాయి. తైజ్ ఎయిర్‌పోర్టుకు సమీపంలోని కీలక కేంద్రాలపై కూడా వైమానిక దాడులు నిర్వహించాయి.