Home » Vietnam
వియత్నాంలో జరిగిన బోటు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు మృతిచెందిన విషయం తెలిసిందే. వారి భౌతికకాయాలను వీలైనంత త్వరగా స్వస్థలాలకు చేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు.
వియత్నాంలోని ఫు క్వాక్ ద్వీపం సమీపంలో జరిగిన ఘోర బోటు ప్రమాదంలో మరణించిన 15 మంది భారతీయ పర్యాటకుల జాబితాను అధికారులు విడుదల చేశారు. వియత్నాంలోని భారత రాయబార కార్యాలయం తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ మృతుల వివరాలను వెల్లడించింది.
వియత్నాం బోటు ప్రమాద ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ఏపీకి చెందిన ఇద్దరు చనిపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు.
వియత్నాంలోని ఫు క్వాక్ దీవుల సమీపంలో ఘోర పడవ ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 15 మంది భారతీయ పర్యాటకులు మృతిచెందారు. ఈ విషాదకర ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
వియత్నాంలో జరిగిన బోటు ప్రమాదంపై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. వియత్నాంలోని ఫూ క్వాక్ ద్వీపంలో పర్యటనకు వెళ్లిన భారతీయులు బోటు ప్రమాదంలో మృతిచెందారనే సమాచారంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెంటనే అధికారులను అప్రమత్తం చేశారు.
వియత్నాంలో భారతీయ పర్యాటకులతో వెళ్తున్న ఓ బోటు ప్రమాదానికి గురైంది. సుమారు 32 మంది ప్రయాణికులతో వెళ్తున్న టూరిస్ట్ బోటు ఒక్కసారిగా బోల్తా పడటంతో పలువురు మృతిచెందారు, మరికొందరు గల్లంతయ్యారు.
వియత్నాంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన ఫు క్వాక్ ద్వీపం సమీపంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పలువురు భారతీయ పర్యాటకులతో ప్రయాణిస్తున్న ఓ బోటు సముద్రంలో బోల్తాపడింది.
వియత్నాంలో భారతీయులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్న వార్తలపై ఆ దేశ ఎంబసీ తాజాగా స్పందించింది. ఇరు దేశాల ప్రజల మధ్య సంబంధం దృఢమైనదని, భారతీయులకు తమ దేశ ప్రజలు సాదర స్వాగతం పలుకుతారని పేర్కొంది.
కాల్మెగీ తుపాను వియత్నాం దేశంలో బీభత్సం సృష్టించింది. తుపాను ధాటికి దాదాపు 2600 ఇళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. తుపాను గాలులకు ఇళ్ల టాపులు కొట్టుకుపోయాయి. 57 ఇళ్లు పూర్తిస్థాయిలో నేలమట్టమయ్యాయి. ఇక ఫిలిప్పీన్స్‌లో తుపానుకు చిక్కి సుమారు 200 మంది మరణించారు.
100 Civet Cats: ఆ 100 పునుగు పిల్లుల ఖరీదు 50 లక్షల రూపాయలు పైనే ఉంటుంది. తల్లిదండ్రులు తమ కూతురికి పునుగు పిల్లులు కట్నం కింద ఇవ్వటం వెనుక ఓ బలమైన కారణం ఉంది.