Share News

వియత్నాం బోటు ప్రమాదం.. తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం

ABN , Publish Date - Jul 11 , 2026 | 06:03 PM

వియత్నాంలో జరిగిన బోటు ప్రమాదంపై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. వియత్నాంలోని ఫూ క్వాక్ ద్వీపంలో పర్యటనకు వెళ్లిన భారతీయులు బోటు ప్రమాదంలో మృతిచెందారనే సమాచారంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెంటనే అధికారులను అప్రమత్తం చేశారు.

వియత్నాం బోటు ప్రమాదం.. తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం
Vietnam Boat Accident

హైదరాబాద్, జులై 11 (ఆంధ్రజ్యోతి): వియత్నాంలో జరిగిన బోటు ప్రమాదంపై (Vietnam Boat Accident) తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. వియత్నాంలోని ఫూ క్వాక్ ద్వీపంలో పర్యటనకు వెళ్లిన భారతీయులు బోటు ప్రమాదంలో మృతిచెందారనే సమాచారంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Telangana CM Revanth Reddy) వెంటనే అధికారులను అప్రమత్తం చేశారు. వియత్నాం పర్యటనకు వెళ్లిన తెలుగు రాష్ట్రాలకు చెందిన కొందరు పర్యాటకులు అక్కడ బోటు ప్రమాదంలో మరణించారనే సమాచారంపై సీఎం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.


ప్రమాద వివరాలను తెలుసుకోవడంతో పాటు సహాయక చర్యలను ముమ్మరం చేయడంలో కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖతో పాటు వియత్నాంలోని భారతీయ ఎంబసీ కార్యాలయ అధికారులతో సంప్రదింపులు జరిపి అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ ప్రమాదంలో తెలుగువారు ఉన్నారని ప్రాథమిక సమాచారం అందిన నేపథ్యంలో పూర్తి సమాచారం తెలుసుకోవాలని సీఎం సూచించారు.


ఈ ఘటనలో క్షతగాత్రులకు అవసరమైన వైద్యం అందించడానికి చర్యలు తీసుకోవాలని సీఎం దిశానిర్దేశం చేశారు. బాధితులకు తమ ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని ముఖ్యమంత్రి భరోసా కల్పించారు. బాధితుల కుటుంబాల కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు వివరించారు. 4 హెల్ప్‌లైన్ నంబర్లు విడుదల చేసినట్లు చెప్పుకొచ్చారు. సమాచారం కోసం వెంటనే కంట్రోల్ రూమ్‌ను సంప్రదించాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు.


సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు:

9885371189

7997959754

9989654807

7997959779


ఈ వార్తలు కూడా చదవండి...

క్రీడాకారుల కోసం స్పష్టమైన స్పోర్ట్స్‌ పాలసీ తెచ్చాం: సీఎం రేవంత్‌‌రెడ్డి

డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం మీడియా కృషి చేయాలి: గవర్నర్

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jul 11 , 2026 | 06:18 PM