Share News

వియత్నాం బోటు ప్రమాదం.. 15 మంది మృతుల జాబితా.. ముగ్గురు ఆంధ్రావాసులు

ABN , Publish Date - Jul 11 , 2026 | 07:47 PM

వియత్నాంలోని ఫు క్వాక్ ద్వీపం సమీపంలో జరిగిన ఘోర బోటు ప్రమాదంలో మరణించిన 15 మంది భారతీయ పర్యాటకుల జాబితాను అధికారులు విడుదల చేశారు. వియత్నాంలోని భారత రాయబార కార్యాలయం తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ మృతుల వివరాలను వెల్లడించింది.

వియత్నాం బోటు ప్రమాదం.. 15 మంది మృతుల జాబితా.. ముగ్గురు ఆంధ్రావాసులు
Vietnam Boat Tragedy

హనోయ్,జులై 11: వియత్నాంలోని ఫు క్వాక్ ద్వీపం (Phu Quoc Island)సమీపంలో జరిగిన ఘోర బోటు ప్రమాదంలో మరణించిన 15 మంది భారతీయ పర్యాటకుల అధికారిక జాబితాను వియత్నాం అధికారులు ధ్రువీకరించారు. ఈ మేరకు హనోయ్‌లోని భారత రాయబార కార్యాలయం తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ మృతుల వివరాలను అధికారికంగా విడుదల చేసింది.

ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిలో అత్యధికులు తమిళనాడుకు చెందినవారు కాగా.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు, కేరళకు చెందిన ఇద్దరు పర్యాటకులు ఉన్నారు.


అధికారిక మృతుల జాబితా (రాష్ట్రాల వారీగా):

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)కు చెందిన మృతులు:

1. జయలక్ష్మి గెల్లి (Jaya Lakshmi Gelli) - మచిలీపట్నం వ్యాపారవేత్త కిషోర్ భార్య

2. నల్లాపేట రవితేజ ఆదిశేషయ్య (Nallapeta Raviteja Adiseshaiah)

3. శ్రీధర్ ముడియం (Sreedhar Mudiam)

తమిళనాడు (Tamil Nadu)కు చెందిన మృతులు:

4. సెంథిల్ కుమార్ జయవేల్ (Senthil Kumar Jayavel)

5. మురుగ ప్రభు ఆరుముగం (Muruga Prabhu Arumugam)

6. శ్రీధర్ సుందరరాజన్ (Sridhar Sundararajan)

7. షేక్ అబ్దుల్లా అబ్దుల్ మజీద్ (Shaik Abdullah Abdul Majeed)

8. బాలాజీ నటేశన్ (Balaji Natesan)

9. వినయ్ కుమార్ చిత్రపురం భాస్కర (Vinaya Kumar Chithapuram Bhaskara)

10. రవిశంకర్ సుగుమారన్ (Ravisankar Sugumaran)

11. సంతోష్ కుమార్ శాంతిలాల్ జైన్ (Santosh Kumar Shantilaljain)

12. బాబు కుప్పుస్వామి (Babu Kuppuswamy)

13. అళగురాజన్ శివసామి (Alagurajan Sivasamy)

కేరళ (Kerala)కు చెందిన మృతులు:

14. అవికోట్ చెరియన్ థామస్ (Avicot Cheriyan Thomas)

15. శ్రీమతి లోవేని థామస్ (Loveni Thomas)


రెస్క్యూ ప్రక్రియ పూర్తి - నిరంతరం హెల్ప్‌లైన్ సేవలు

ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు భారత రాయబార కార్యాలయం తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. బాధితుల భౌతికకాయాలను భారత్‌కు తరలించేందుకు, క్షేత్రస్థాయిలో ఇతర అత్యవసర సహాయం అందించేందుకు హనోయ్‌లోని ఎంబసీతో పాటు, హో చి మిన్ సిటీలోని భారత కాన్సులేట్ జనరల్ బృందాలు నిరంతరం అందుబాటులో ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు. బాధితుల కుటుంబ సభ్యులు సహాయం కోసం ఎంబసీ కంట్రోల్ రూమ్‌ను సంప్రదించవచ్చని తెలిపారు.

Updated Date - Jul 11 , 2026 | 08:05 PM