Share News

వియత్నాంలో ఘోర ప్రమాదం.. భారతీయులతో వెళ్తున్న పర్యాటక బోటు బోల్తా!

ABN , Publish Date - Jul 11 , 2026 | 03:23 PM

వియత్నాంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన ఫు క్వాక్ ద్వీపం సమీపంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పలువురు భారతీయ పర్యాటకులతో ప్రయాణిస్తున్న ఓ బోటు సముద్రంలో బోల్తాపడింది.

వియత్నాంలో ఘోర ప్రమాదం.. భారతీయులతో వెళ్తున్న పర్యాటక బోటు బోల్తా!
Boat Carrying Indian Tourists Capsizes Near Vietnam's Phu Quoc Island

హనోయ్,జులై 11: వియత్నాంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన ఫు క్వాక్ ద్వీపం(Phu Quoc Island) సమీపంలో ఇవాళ (శనివారం) ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పలువురు భారతీయ పర్యాటకులతో ప్రయాణిస్తున్న బోటు సముద్రంలో బోల్తాపడింది. ఈ విషయాన్ని వియత్నాంలోని భారత రాయబార కార్యాలయం అధికారికంగా ధ్రువీకరించింది. ప్రస్తుతం స్థానిక అధికారులు ఘటనా స్థలంలో ముమ్మరంగా గాలింపు, సహాయక చర్యలు చేపడుతున్నారు.


రంగంలోకి సహాయక బృందాలు

ఈ ప్రమాదానికి సంబంధించిన కచ్చితమైన వివరాలు, బోటులో మొత్తం ఎంతమంది పర్యాటకులు ఉన్నారు.. వారి ప్రస్తుత పరిస్థితి ఏమిటన్నది ఇంకా పూర్తిగా తెలియరాలేదు. ఈ ఘటనపై భారత రాయబార కార్యాలయం సామాజిక మాధ్యమం 'X' లో స్పందిస్తూ.. 'ఓ విషాదకరమైన ఘటనలో, కొన్ని గంటల క్రితం వియత్నాంలోని ఫు క్వాక్ ద్వీపం సమీపంలో పలువురు భారతీయ పర్యాటకులతో వెళ్తున్న బోటు బోల్తాపడింది. స్థానిక అధికారులు రెస్క్యూ ఆపరేషన్లు కొనసాగిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నాం' అని పేర్కొంది.


అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్లు (Control Rooms)

ప్రమాదానికి గురైన పర్యాటకుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించేందుకు, అవసరమైన సహాయం చేయడానికి భారత ప్రభుత్వం వియత్నాంలో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటుచేసింది. బాధిత కుటుంబాలు సమాచారం కోసం కింది నంబర్లను సంప్రదించవచ్చు:

1. హో చి మిన్ సిటీలోని భారత కాన్సులేట్ జనరల్:

+84 36 281 7930

+84 91 552 37 14

+84 33 452 0414**

2. హనోయ్‌లోని ప్రధాన కార్యాలయం:

+84 91 308 9165


మచిలీపట్నం వ్యాపారి భార్య సహా ఏపీ, తమిళనాడుకు చెందిన 18 మంది మృతి!

ఈ ఘోర బోటు ప్రమాదానికి సంబంధించి అందిన తాజా సమాచారం ప్రకారం.. ప్రమాద సమయంలో బోటులో సుమారు 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన సుమారు 18 మంది మరణించినట్లు సమాచారం. కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కిషోర్ కుటుంబం కూడా ఈ విహారయాత్రలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో కిషోర్ భార్య మరణించగా, అపస్మారక స్థితిలోకి వెళ్లిన కిషోర్‌ను స్థానిక ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. స్థానిక అధికారుల సహాయక చర్యలు పూర్తిగా ముగిసిన అనంతరం ఈ వివరాలపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

VIATNAM-BOAT-ACCIDENT.jpg


తాజాగా వియాత్నాలంని ఇండియన్ ఎంబసీ ఈ బోటు ప్రమాదంలో మృతిచెందిన వారి వివరాలను వెల్లడించింది.


ఈ వార్తలు కూడా చదవండి

తెలంగాణ బులెట్ ట్రైన్స్ హబ్‌గా మారబోతోంది: అశ్వినీ వైష్ణవ్

ఐదు గనులకు ఫైవ్‌ స్టార్‌ రేటింగ్‌

Updated Date - Jul 11 , 2026 | 04:47 PM