రీల్స్ మోజులో చిన్నారిని పట్టించుకోని తల్లిదండ్రులు.. చివరికి..
ABN , Publish Date - Oct 20 , 2026 | 06:00 PM
రీల్స్ మోజులో పడి కన్నబిడ్డ భద్రతనే మరిచారా తల్లిదండ్రులు. సముద్ర తీరంలో వీడియో తీస్తుండగా, పసికందు అలలకు దగ్గరగా వెళ్లి ప్రమాదంలో పడే పరిస్థితి ఏర్పడింది.
ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియా కోసం రీల్స్, వీడియోలు తీసే క్రమంలో కొందరు కనీస జాగ్రత్తలను కూడా మరిచిపోతున్నారు. సముద్ర తీరంలో ఓ జంట తమను సెల్ఫీ స్టిక్‌తో రికార్డ్ చేసుకుంటుండగా.. వారి పసికందు వస్తున్న అలలకు దగ్గరగా ఉన్నట్లు వీడియోలో కనిపిస్తోంది.
అలలు చిన్నారి వైపు దూసుకొస్తుండటంతో బిడ్డ ప్రమాదంలో పడే పరిస్థితి ఏర్పడింది. అయితే.. తల్లిదండ్రులు వీడియో తీయడంలో నిమగ్నమై ఉండగా, సమీపంలో ఉన్న ఓ వ్యక్తి ప్రమాదాన్ని గుర్తించి వెంటనే చిన్నారి వద్దకు పరుగెత్తుకొచ్చాడు. ఆ వ్యక్తి పసికందును పట్టుకుని సురక్షితంగా వెనక్కి తీసుకురావడంతో ప్రమాదం తప్పినట్లు వీడియోలో కనిపిస్తోంది.
ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. 'రీల్ క్రేజ్ అంటే అంతే.. బాబూ భయ్యా పిల్లలూ దాని గురించి మర్చిపోండి, కుటుంబాన్ని మర్చిపోండి, ప్రపంచాన్ని మర్చిపోండి' అని ఒకరు కామెంట్ చేయగా, 'సెల్ఫీ సంస్కృతి జీవితాలను నాశనం చేస్తుంది’ అని మరో నెటిజన్ కామెంట్ చేశారు. ‘ఎంజాయ్మెంట్ కోసం ఇలాంటి ప్రదేశాలకు పిల్లల్ని ఎందుకు తీసుకువెళ్తారు?’ అని ఇంకో నెటిజన్ కామెంట్ చేశారు. అయితే, ఈ ఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగిందనే వివరాలతో పాటు సంబంధిత వ్యక్తుల గుర్తింపును స్వతంత్రంగా ధ్రువీకరించలేదు.
ఈ వార్తలనూ చదవండి:
ఎదురుగా ట్రాఫిక్ పోలీసులు.. బైకర్ ఏం చేశాడంటే.. వీడియో వైరల్
కశ్మీర్లో పురాతన శివలింగం పునరుద్ధరణ.. పోటెత్తుతున్న భక్తులు