Share News

కశ్మీర్‌లో పురాతన శివలింగం పునరుద్ధరణ.. పోటెత్తుతున్న భక్తులు

ABN , Publish Date - Oct 18 , 2026 | 05:11 PM

జమ్మూ కశ్మీర్‌ బారాముల్లాలో అత్యంత పురాతనమైన శివలింగాన్ని ఇటీవల పునరుద్ధరించారు. స్థానిక కాలిబాగ్ ప్రాంతంలోని ఈ చారిత్రక శివలింగం సుమారు 500 సంవత్సరాల నాటిదని భక్తులు విశ్వసిస్తున్నారు.

కశ్మీర్‌లో పురాతన శివలింగం పునరుద్ధరణ.. పోటెత్తుతున్న భక్తులు

ఇంటర్నెట్ డెస్క్: జమ్మూ కశ్మీర్‌ బారాముల్లాలో అత్యంత పురాతనమైన శివలింగాన్ని ఇటీవల పునరుద్ధరించారు. స్థానిక కాలిబాగ్ ప్రాంతంలోని ఈ చారిత్రక శివలింగం సుమారు 500 సంవత్సరాల నాటిదని భక్తులు విశ్వసిస్తున్నారు. అయితే ఈ శివలింగానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు స్థానిక కశ్మీరీ పండిట్లు చాలా కాలంగా శ్రమిస్తున్నారు. ఈ పురాతన శివాలయం పునరుద్ధరణ పనులను స్థానిక ముస్లిం సోదరులు కూడా సహకరిస్తున్నారు. ఈ చారిత్రక కట్టడం పునరుద్ధరణతో కాశ్మీర్ ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వానికి మళ్లీ గుర్తింపు లభించిస్తుందంటూ స్థానికులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.


ఈ వారసత్వ సంపదను కాపాడేందుకు ఆలయ నిర్మాణ పనులను స్థానిక కమిటీతోపాటు జిల్లా యంత్రాంగం కూడా నడుం బిగించింది. మరో వైపు ఈ భారీ శివలింగాన్ని చూసేందుకు భక్తులంతా ఆ ప్రాంతానికి తరలి వస్తున్నారు. దీంతో ఈ ప్రాంతం భక్తులతో నిత్యం రద్దీగా మారింది. ఇంకో వైపు ఈ భారీ శివలింగానికి పాలతో అభిషేకం చేసేందుకు భక్తులు పోటెత్తుతున్నారు.

Updated Date - Oct 18 , 2026 | 05:18 PM