Share News

ఎదురుగా ట్రాఫిక్ పోలీసులు.. బైకర్ ఏం చేశాడంటే.. వీడియో వైరల్

ABN , Publish Date - Oct 18 , 2026 | 06:11 PM

రూల్స్ తప్పక పాటించాలంటూ వాహనదారులను నిత్యం ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తం చేస్తుంటారు. అయినా ట్రాఫిక్ రూల్స్‌‌ను వాహనదారులు అతిక్రమిస్తుంటారు. ఈ రూల్స్ అతిక్రమించి పట్టుబడితే.. ట్రాఫిక్ పోలీసులు చలానాలు విధిస్తారు.

ఎదురుగా ట్రాఫిక్ పోలీసులు.. బైకర్ ఏం చేశాడంటే.. వీడియో వైరల్

ఇంటర్నె్ట్ డెస్క్: రూల్స్ తప్పక పాటించాలంటూ వాహనదారులను నిత్యం ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తం చేస్తుంటారు. అయినా ట్రాఫిక్ రూల్స్‌‌ను వాహనదారులు అతిక్రమిస్తుంటారు. ఈ రూల్స్ అతిక్రమించి పట్టుబడితే.. ట్రాఫిక్ పోలీసులు చలానాలు విధిస్తారు. అవి కూడా భారీ మొత్తంలో నగదు జరిమానా విధిస్తుంటారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసుల కంట పడకుండా వెళ్లిపోవాలని వాహనదారులు ప్రయత్నిస్తారు. దీంతో ఒకొక్కసారి మృత్యువు ఒడిలోకి వాహనదారులు చేరుకుంటారు. భూమి మీద నూకలంటే ఎలాగైనా బతికేస్తారు. అలాగే ఓ మహిళ బైక్‌పై నుంచి కింద పడి బతికి.. పోయింది. ఈ వీడియో వైరల్ అవుతోంది.


జనసమర్థం ఉన్న ప్రాంతంలో బైక్‌పై ట్రిపుల్ రైడింగ్ చేస్తున్నారు. అంతలో ట్రాఫిక్ పోలీసులను చూసి బైకర్ హడలిపోయాడు. ఆ వాహనాన్ని వంకర టింకరగా ముందుకు అత్యంత వేగంగా పోనిచ్చాడు. ఆ క్రమంలో బైక్‌పై ఉన్న మహిళ రహదారిపై పడిపోయింది. అక్కడే ఉన్న పోలీసులు వెంటనే స్పందించి.. ఆ మహిళను పైకి లేపారు. ఆ తర్వాత ఆమె అక్కడి నుంచి నడచుకుంటూ ముందుకు వెళ్లిపోయింది. కానీ బైక్‌ను మాత్రం అతడు ఆపకుండా వేగంగా ముందుకు దూసుకుపోయాడు. ఇదంతా వీడియోలో నిక్షిప్తమైంది.


ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని రూర్కెలా నగరంలో త్రిశూల్ చౌక్‌లో చోటు చేసుకుందని తెలుస్తుంది. ఈ వీడియోను PhoolSinghRajpoot అనే యూజర్ షేర్ చేశారు. ఈ వీడియోను లక్షలాది మంది వీక్షించి.. లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. నంబర్ ప్లేట్లు లేని వాహనాలు, హెల్మెట్లు ధరించని వారిని పట్టుకునేందుకు పోలీసులు ఈ తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.


వాహన ప్రమాదాలను నివారించేందుకే ట్రాఫిక్ పోలీసులు తమ విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు. అలాంటిది వారిని లెక్క చేయకుండా వెళ్లడం నేరమని అంటున్నారు. అతడికి భారీగా జరిమానా విధించాలని ట్రాఫిక్ పోలీసులకు స్పష్టం చేస్తున్నారు. బైక్ పైనుంచి పడిన మహిళకు ఏమైనా జరిగితే పరిస్థితి ఏమిటని నెటిజనులు ప్రశ్నిస్తున్నారు.

Updated Date - Oct 18 , 2026 | 07:19 PM