కొలంబియాలో బంగారు గని కూలి 14 మంది మృతి
ABN , Publish Date - Oct 20 , 2026 | 05:56 PM
నైరుతి కొలంబియాలో ఘోరం జరిగింది. శాంటా బార్బరా డి ఇస్కువాండే మునిసిపాలిటీ పరిధిలోని చంబేరో సెక్టార్‌లో బంగారు గని కూలిపోయి 14 మంది చనిపోయారు. ఈ విషయాన్ని స్థానిక అధికారులు సోమవారం తెలిపారు. ప్రమాదం జరిగిన విషయం తెలుసుకొని అధికారులు, పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
ఇంటర్‌నెట్ డెస్క్: నైరుతి కొలంబియాలో విషాదం చోటుచేసుకుంది. శాంటా బార్బరా డి ఇస్కువాండే మునిసిపాలిటీ పరిధిలోని చంబేరో సెక్టార్‌లో బంగారు గని కూలిపోయి 14 మంది చనిపోయారు. ఈ విషయాన్ని స్థానిక అధికారులు సోమవారం తెలిపారు. ప్రమాదం జరిగిన విషయం తెలుసుకొని అధికారులు, పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గనిలో ఇరుక్కున్న వారిని బయటకు తీశారు. గాయపడిన ఏడుగురిని ఆసుపత్రికి తరలించారు. 12 నుంచి 15 మంది ఆచూకీ తెలియరాలేదని, వారి కోసం గాలింపు కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు.
శాంటా బార్బరా డి ఇస్కువాండే దట్టమైన అడవుల్లో ఉండడంతో కమ్యూనికేషన్‌కు ఇబ్బంది కలుగుతోందని చెప్పారు. బంగారు గనిని అక్రమంగా నిర్వహిస్తున్నారని, కొలంబియాలోని గ్రామీణ ప్రాంతాల్లో అనుమతులు లేకుండా గనులు నిర్వహించడం సర్వసాధారణంగా మారిందని వెల్లడించారు. అలాంటి చోట్ల సరైన భద్రతాపరమైన మౌలిక సౌకర్యాలు ఉండవని, దీంతో తరచూ ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నారు. ప్రమాదం జరిగినా కూడా ప్రాణాలు కాపాడేందుకే ప్రాధాన్యం ఇస్తామని అధికారులు చెప్పారు. కాగా.. నారినో కొలంబియాలోని పోలికార్పా మునిసిపాలిటీలో ఈ ఏడాది ఆగస్టు 13న కూడా ఇలాంటి ప్రమాదమే సంభవించింది. ఆ ప్రమాదంలో 13 మంది చనిపోయారు.
ఈ వార్తలనూ చదవండి:
ట్రేడ్ డీల్ వల్ల భారత్‌కు సుంకాల నుంచి మినహాయింపు: మార్కో రూబియో
ఎన్నికల్లో మోసం.. యూఎస్ గ్రీన్ కార్డు ఉన్న భారతీయులపై కేసు