Share News

భారతీయులైన నా అత్తమామలంటే చాలా ఇష్టం: అమెరికా ఉపాధ్యక్షుడు

ABN , Publish Date - Oct 20 , 2026 | 12:12 PM

హెచ్‌-1బీ వీసాలపై తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మరోసారి సమర్థించుకున్నారు. అమెరికాలో పనిచేస్తున్న విదేశీ ఉద్యోగులను 'విదేశీ ఒప్పంద బానిసలు'గా అభివర్ణించిన వాన్స్ వివాదానికి తెరతీశారు.

భారతీయులైన నా అత్తమామలంటే చాలా ఇష్టం: అమెరికా ఉపాధ్యక్షుడు
JD Vance

ఇంటర్నెట్ డెస్క్: హెచ్‌-1బీ వీసాలపై తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మరోసారి సమర్థించుకున్నారు. అమెరికాలో పనిచేస్తున్న విదేశీ ఉద్యోగులను 'విదేశీ ఒప్పంద బానిసలు'గా అభివర్ణించిన వాన్స్ వివాదానికి తెరతీశారు. అయితే తన విమర్శలు ఉద్యోగులపై కాదని, వారిని నియమించుకుంటున్న కంపెనీలు, వీసా విధానంపైనేనని స్పష్టం చేశారు. తన వ్యాఖ్యల తీరు సరిగా లేకపోవచ్చు గానీ, ఉద్దేశం సరైనదేనని అన్నారు (JD Vance Indian in laws).


తన భార్య ఉషా వాన్స్ తల్లిదండ్రులు దక్షిణ భారతదేశం నుంచి అమెరికాకు వలస వచ్చారని, వారంటే తనకు ఎంతో ఇష్టమని అన్నారు. అమెరికాలో జరిగిన ఓ టెలివిజన్ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న వాన్స్‌కు గత వ్యాఖ్యలపై ప్రశ్న ఎదురైంది. హెచ్‌-1బీ వీసాలపై పనిచేస్తున్న వారిని ఒప్పంద బానిసలుగా అభివర్ణించడం ద్వారా వలసదారులను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఓ మహిళ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ మహిళ వ్యాఖ్యలపై వాన్స్ స్పందించారు. తన భార్య తల్లిదండ్రులు కూడా దక్షిణ భారత దేశం నుంచి వలస వచ్చిన వారేనని వాన్స్ తెలిపారు (Indentured servants remark).


తన వ్యాఖ్యల తీరు సరైన విధంగా లేకపోయి ఉండవచ్చని వాన్స్ అంగీకరించారు (Indian IT professionals). హెచ్‌-1బీ వీసాదారులను అవమానించడం తన ఉద్దేశం కాదని స్పష్టం చేశారు. అమెరికాలోని కొన్ని కంపెనీలు స్థానికులను తొలగించి, విదేశీ ఉద్యోగులను నియమించుకుంటున్నాయని వాన్స్ ఆరోపించారు. అయితే దీనికి విదేశీ ఉద్యోగులు కారణం కాదని వాన్స్ అన్నారు. హెచ్-1బీ కార్యక్రమాన్ని దుర్వినియోగం చేసే కంపెనీలు, వీసా వ్యవస్థలోని లోపాలే స్థానికులకు ఉద్యోగులు రాకపోవడానికి కారణమని వాన్స్ వాదించారు.


ఇవి కూడా చదవండి..

త్వరలోనే పారిస్ ముస్లిం నగరంగా మారుతుంది.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..


స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

Updated Date - Oct 20 , 2026 | 12:12 PM