Home » JD Vance
ఉక్రెయిన్‌లో శాంతిభద్రతల పరిరక్షణ కోసం భారత సైన్యాన్ని రంగంలోకి దించాలనే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన ప్రతిపాదనను అధ్యక్షుడు ట్రంప్ నవ్వుతూ కొట్టిపారేశారని, భారతీయులు దేనికీ పైసా ఖర్చు పెట్టరు.. ఇలాంటి వాటికి అస్సలు డబ్బులు ఇవ్వరని ట్రంప్ వ్యాఖ్యానించినట్లు ఓ కొత్త పుస్తకం వెల్లడించింది.
స్విట్జర్లాండ్‌లో జరిగిన అమెరికా–ఇరాన్ చర్చల సందర్భంగా అగ్రరాజ్య ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు అత్యంత ఇష్టమైన భారతీయ, పాకిస్థానీ వ్యక్తుల గురించి మాట్లాడారు.
తన జీవితంలో భార్య ఉష వాన్స్, పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ అత్యంత ముఖ్యులు అంటూ యూఎస్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన సరదా వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.
ఇరాన్ - అమెరికా దేశాల మధ్య కుదిరిన 14 అంశాల అవగాహనా ఒప్పందాన్ని పూర్తిగా అమలు చేయడానికి రాబోయే 60 రోజుల్లో సాంకేతిక వివరాలను ఖరారు చేయాల్సి ఉంది. అందులో భాగంగా ఇవాళ స్విట్జర్లాండ్‌లో మొదటి విడత చర్చలు ప్రారంభమయ్యాయి.
తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు విశేషాలను అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తాజాగా ఒక పాడ్‌కాస్ట్‌లో పంచుకున్నారు. ఇది నెట్టింట పెద్ద చర్చకు దారి తీసింది.
శాంతి ఒప్పందంలో భాగంగా ఇరాన్ పునర్నిర్మాణం కోసం అమెరికా 300 బిలియన్ డాలర్ల ఆర్థికసాయం చేయబోతోందని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్పందించారు.
అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందం అధికారిక సంతకాలకు ముందే డిజిటల్‌గా పూర్తైందని యూఎస్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ వెల్లడించారు. అయితే ఇరాన్ ఒప్పంద నిబంధనల్ని అమలు చేశాకే ఆంక్షల సడలింపులు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.
ఉషను పెళ్లి చేసుకోకుంటే జీవితాంతం బ్యాచిలర్‌గానే ఉండిపోవాలనుకున్నానని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పేర్కొన్నారు. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను తన ఆత్మకథ 'కమ్యూనియన్: ఫైండింగ్ మై వే బ్యాక్ టు ఫెయిత్' లో జేడీ వాన్స్ పంచుకున్నారు.
ఇరాన్‌తో డీల్ కుదరలేదన్న యూఎస్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వ్యాఖ్యలపై ఇరాన్ ఎంబసీ స్పందించింది. యుద్ధంలో సాధించలేనిది చర్చలతో సాధించాలని యూఎస్ భావిస్తుండటంతో చర్చలు విఫలమయ్యాయని పేర్కొంది.
పాక్‌కు బయలుదేరిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇరాన్‌కు గట్టి హెచ్చరిక చేశారు. తమతో గేమ్స్ వద్దని స్పష్టం చేశారు. అయితే, చర్చలు సానుకూలంగానే సాగుతాయని తాము ఆశిస్తున్నామని తెలిపారు.