నా లైఫ్‌లో ఒక ఇండియన్, ఒక పాకిస్థానీ అత్యంత ముఖ్యులు.. జేడీ వాన్స్ సరదా కామెంట్
ABN , Publish Date - Jun 21 , 2026 | 09:11 PM
తన జీవితంలో భార్య ఉష వాన్స్, పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ అత్యంత ముఖ్యులు అంటూ యూఎస్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన సరదా వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.
ఇంటర్నెట్ డెస్క్: స్విట్జర్లాండ్‌లో నేడు ఇరాన్‌తో శాంతి చర్చల అనంతరం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. తొలి రోజు చర్చల్లో మంచి పురోగతి కనిపించిందని అన్నారు. ఈ చర్చలకు మధ్యవర్తిత్వం వహిస్తున్న ఖతార్‌తో పాటు పాక్‌పై కూడా ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్, ఆర్మీ జనరల్ ఆసిమ్ మునీర్ సమక్షంలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
‘నా లైఫ్‌లో ఒక ముఖ్యమైన ఇండియన్, మరో పాకిస్థానీ ఉన్నారు. వాళ్లల్లో ఒకరు నా భార్య ఉష మరొక వ్యక్తి పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్. ఇస్లామాబాద్‌లో చర్చల సందర్భంగా ఫీల్డ్ మార్షల్ మునీర్ నన్ను సాదరంగా ఆహ్వానించిన నాటి నుంచీ ఇదే సరదా కామెంట్ చేస్తూన్నాను’ అని వాన్స్ అన్నారు. గత మూడు నెలల్లో తాను ఫీల్డ్ మార్షల్ మునీర్‌తోనే అత్యధిక సార్లు మాట్లాడానని చెప్పారు. తాను ఒక మంచి దౌత్యవేత్త అని మునీర్ నిరూపించుకున్నారని చెప్పారు.
అమెరికా వైస్ ప్రెసిడెంట్ వాన్స్ ఇటీవల కాలంలో పలుమార్లు తన భార్య ఉష ప్రస్తావన తెచ్చిన విషయం తెలిసిందే. ఇక పాక్ ప్రధాని, ఆర్మీ చీఫ్‌లపై కూడా వాన్స్ గతంలో పలుమార్లు ప్రశంసలు కురిపించారు. మునీర్, షరీఫ్‌లు ఇచ్చిన ఆతిథ్యం గొప్పదని ఇస్లామాబాద్ చర్చల సందర్భంగా వాన్స్ ప్రశంసించారు. పాక్, అమెరికాలను వారు మరింత దగ్గర చేశారని అన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
యూఎస్‌తో డీల్ మాకు అనుకూలం: ఇరాన్ అధ్యక్షుడు
చర్చలు విఫలమైతే మళ్లీ దాడులు చేస్తాం.. ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక