అమెరికాలో ఉద్యోగాలు అమెరికన్లకే: యూఎస్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్
ABN , Publish Date - Jul 09 , 2026 | 11:13 PM
హెచ్-1బీ వీసా దుర్వినియోగం ఉదంతాలపై అమెరికా ప్రభుత్వం దర్యాప్తు జరుపుతున్న నేపథ్యంలో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. వీసా ప్రోగ్రామ్‌ల దుర్వినియోగాన్ని అస్సలు సహించబోమని హెచ్చరించారు.
ఇంటర్నెట్ డెస్క్: హెచ్-1బీ మోసాలు, దుర్వినియోగంపై దర్యాప్తు చేసేందుకు అమెరికా ఫెడరల్ ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఈ నేపథ్యంలో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో జాబ్స్ అమెరికన్లకే అని తేల్చి చెప్పారు. వీసా వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ అమెరికన్లకు జాబ్స్ దక్కకుండా చేసిన వారిని ఉపేక్షించబోమని హెచ్చరించారు. మిల్వాకీలో ఎయిర్ నేషనల్ గార్డ్ రిఫ్యూలింగ్ బేస్‌ను బుధవారం సందర్శించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
‘ఇక్కడ మనకు హెచ్-1బీ అని ఒక వీసా ప్రోగ్రామ్ ఉంది. ఈ వీసా దుర్వినియోగం ఉదంతాలపై పెద్ద ఎత్తున దర్యాప్తు జరుగుతోంది. దీన్ని బట్టి ప్రభుత్వం ఫ్రాడ్ టాస్క్ ఫోర్స్ ఎంతటి విస్తృత దర్యాప్తు చేస్తోందో అర్థం చేసుకోవచ్చు. పన్ను చెల్లింపుదార్ల తరఫున మేము పోరాడుతున్నాము. ఇలాంటి వీసా ప్రోగ్రామ్స్‌ను మోసగాళ్లకు అనువుగా మారకుండా చర్యలు తీసుకుంటున్నాము’ అని ఆయన తెలిపారు. మేధావులు అమెరికాకు వచ్చేందుకు ఈ వీసా గతంలో ఒక ప్రధాన మార్గంగా ఉండేదని అన్నారు. కానీ ప్రస్తుతం అమెరికన్‌లకు అందే సగటు జీతాన్ని తగ్గేలా బడా కార్పొరేట్ కంపెనీలు, మోసగాళ్లు వీసాను దుర్వినియోగపరుస్తున్నారని చెప్పారు.
ఈ వార్తలనూ చదవండి:
ఒకటికి ఒకటి కలిపితే పదకొండు.. ఆస్ట్రేలియాతో బంధంపై ప్రధాని మోదీ
అవసరమైతే ఇరాన్‌పై దాడులకు సిద్ధమే: ఇరాన్