Share News

అవసరమైతే ఇరాన్‌పై దాడులకు సిద్ధమే: ఇరాన్

ABN , Publish Date - Jul 09 , 2026 | 10:42 PM

అవసరమైతే ఇరాన్‌పై మళ్లీ దాడులు చేసేందుకు తాము సిద్ధమేనని ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి కాట్జ్ గురువారం చెప్పారు. గతంలో కంటే మరింత శక్తిమంతమైన దాడులు చేస్తామని అన్నారు.

అవసరమైతే ఇరాన్‌పై దాడులకు సిద్ధమే: ఇరాన్
Israel Warns Iran

ఇంటర్నెట్ డెస్క్: అవసరమైతే ఇరాన్‌పై మళ్లీ దాడులు చేసేందుకు తాము సిద్ధమేనని ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి కాట్జ్ గురువారం చెప్పారు. గతంలో కంటే మరింత శక్తిమంతమైన దాడులు చేస్తామని అన్నారు. ఇజ్రాయెల్‌లో జరిగిన ఒక సైనిక కార్యక్రమంలో ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో కలిసి పాల్గొన్న రక్షణ శాఖ మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ‘మా ఆర్మీ సిద్ధంగా ఉంది. హైఅలర్ట్‌లో ఉంది. యుద్ధం మళ్లీ ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాము. గగనతలంపై ఆధిపత్యాన్ని మళ్లీ సాధించుకునేందుకు సంసిద్ధంగా ఉన్నాము. అవసరమైతే అన్ని రకాల ముప్పులను తొలగించేందుకు మేము రెడీ’ అని అన్నారు.


ఈ సందర్భంగా ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా మాట్లాడారు. గతంలో ఇజ్రాయెల్ రెండు పర్యాయాలు జరిగిన దాడులతో ఇరాన్ బలహీనపడిందని చెప్పారు. ఇజ్రాయెల్ మాత్రం మునుపెన్నడూ చూడని స్థాయిలో బలపడిందని అన్నారు. ఇజ్రాయెల్ ఎయిర్‌ఫోర్స్ యెమెన్ నుంచి ఇరాన్ వరకూ తన సత్తా చాటగలదని ఇప్పటికే తాము రుజువు చేశామని చెప్పారు. మిలిటరీ కార్యాచరణ ఇంకా పూర్తి కాలేదని కూడా చెప్పారు. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్‌లు ఇరాన్‌పై సంయుక్తంగా దాడులు జరగడంతో గల్ఫ్ ఉద్రిక్తతలు పతాకస్థాయికి చేరిన విషయం తెలిసిందే.


ఈ వార్తలనూ చదవండి:

చైనాలోని షూ ఫ్యాక్టరీలో ఘోర అగ్నిప్రమాదం.. 28 మంది మృతి

ఒకటికి ఒకటి కలిపితే పదకొండు.. ఆస్ట్రేలియాతో బంధంపై ప్రధాని మోదీ

Updated Date - Jul 09 , 2026 | 10:42 PM