ఒకటికి ఒకటి కలిపితే పదకొండు.. ఆస్ట్రేలియాతో బంధంపై ప్రధాని మోదీ
ABN , Publish Date - Jul 09 , 2026 | 08:06 PM
భారత్, ఆస్ట్రేలియా మధ్య దృఢమైన దౌత్యబంధం ఉందని ప్రధాని మోదీ కామెంట్ చేశారు. ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య బంధంపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రధాని నరేంద్ర మోదీ ఆస్ట్రేలియా పర్యటన నేపథ్యంలో ఇరు దేశాల బంధం మరింత బలోపేతమైంది. ఇరు దేశాలు పలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. మొత్తం 18 అంశాల్లో ఇరు దేశాల మధ్య సహకారం గురించి ఆస్ట్రేలియా, భారత్ ప్రధానులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఇరు దేశాల మధ్య దౌత్య బంధంపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మెల్బోర్న్లోని కార్యక్రమంలో ప్రసంగించిన మోదీ ఎన్నారైలపై ప్రశంసలు కురిపించారు. చక్కెరతో పాలు మరింత తీయగా మారినట్టు భారతీయులు అక్కడి సమాజంలో మిళితమయ్యారని చెప్పారు. అక్కడి భారతీయుల ఇళ్లల్లో పాలు ఆస్ట్రేలియాకు చెందినవేమో గానీ టీ మాత్రం భారత్‌దేనని చమత్కరించారు.
ఒకటికి ఒకటి కలిపితే రెండవుతాయంటూ భారత్‌తో తమ దేశానికి ఉన్న బంధాన్ని ఆస్ట్రేలియా ప్రధాని నిర్వచించారు. అయితే, ప్రధాని మోదీ మాత్రం ఒకటికి ఒకటి కలిపితే 11 అంటూ హిందీ జాతీయంతో చమత్కరించారు.
మానవత్వ విలువల ఆధారంగా భారత్ పొరుగు దేశాలకు సాయం అందిస్తుంటుందని ప్రధాని మోదీ చెప్పారు. అందుకే భారత్‌పై ప్రపంచ దేశాలకు నమ్మకం ఎక్కువని అన్నారు.
భారత సైనిక సామర్థ్యాలను ఆపరేషన్ సిందూర్ ప్రపంచానికి చాటిచెప్పిందని ప్రధాని మోదీ అన్నారు. భారత రక్షణ రంగ సామర్థ్యాన్ని, విశ్వసనీయతను ప్రపంచం ప్రత్యక్షంగా చూసిందని అన్నారు.
టెక్నాలజీ రంగంలో భారత్ ఎంతో పురోగతి సాధించిందని ప్రధాని అన్నారు. టెలికమ్ రంగంలో గ్లోబల్ లీడర్‌గా ఎదిగిందని చెప్పారు. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద 5జీ నెట్వర్క్ ఉన్న దేశంగా అవతరించిందని చెప్పారు. స్వదేశీ 6జీ టెక్నాలజీ కోసం ప్రయత్నాలు ఊపందుకున్నాయని చెప్పారు. భారత్ ఆస్ట్రేలియా మధ్య క్రికెట్ దౌత్యభాషగా నిలుస్తోందని కూడా ప్రధాని వ్యాఖ్యానించారు.
ఈ వార్తలనూ చదవండి:
ఘనంగా ఖమేనీ అంతిమయాత్ర.. ఫైటర్ జెట్ల పహారాలో మష్హద్ చేరిన భౌతికకాయం
భారీ వరదలు.. చైనీయులను వణికిస్తున్న పాములు.. వీడియో వైరల్..