ఉషది ఏ తెగ? అని అమ్మ అడిగింది: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్
ABN , Publish Date - Jun 19 , 2026 | 05:34 PM
తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు విశేషాలను అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తాజాగా ఒక పాడ్‌కాస్ట్‌లో పంచుకున్నారు. ఇది నెట్టింట పెద్ద చర్చకు దారి తీసింది.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇటీవల తన భార్య ఉషతో పరిచయం, పెళ్లి గురించి పలు విషయాలు తెలిపారు. తన జీవిత విశేషాల ఆధారంగా ఆయన ‘కమ్యూనియన్: ఫైండింగ్ మై వే బ్యాక్ టూ ఫెయిత్’ అనే పుస్తకాన్ని రాశారు. ఇటీవలే పుస్తకం విడుదలైన నేపథ్యంలో వాన్స్ ప్రచారకార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఒక పాడ్‌కాస్ట్‌లో వాన్స్ మాట్లాడుతూ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి పలు విషయాలను వెల్లడించారు.
తన తల్లికి మొదట్లో భారతీయుల గురించి పెద్దగా తెలియదని వాన్స్ అన్నారు. తనకు కాబోయే భార్య ఉష ఇండియన్ అని తల్లికి చెప్పగానే ఆమెది ఏ తెగ అని తల్లి ప్రశ్నించిందని గుర్తు చేసుకున్నారు. కొందరు అమెరికన్లకు మిగతా ప్రపంచం గురించి ఎంత తక్కువ తెలుసో ఈ ఉదంతం చెబుతోందని వ్యాఖ్యానించారు.
అయితే, ఈ కామెంట్స్ నెట్టింట పెద్ద చర్చకు దారి తీశాయి. ఉషను ఇబ్బంది పెట్టేలా వాన్స్ వ్యాఖ్యలు ఉన్నాయని కొందరు విమర్శించారు. ఇండియన్ అనే పదం విని వాన్స్ తల్లి పొరబడి ఉంటుందని మరికొందరు చెప్పారు. అమెరికాలోని స్థానిక తెగలనూ ఇండియన్స్ అని పిలుస్తారు కాబట్టి ఉష కూడా ఏదో ఒక తెగకు చెందిన వ్యక్తి అయి ఉంటుందని వాన్స్ తల్లి అనుకుని ఉండవచ్చని అన్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం వైరల్‌గా మారింది.
ఈ వార్తలనూ చదవండి:
న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వయర్ వద్ద కాల్పుల కలకలం.. భయంతో జనం పరుగులు..
ఇరాన్‌తో అమెరికా డీల్.. మొజ్తాబా ఖమేనీ సంచలన వ్యాఖ్యలు..